నందమూరి తారకరామారావు మనవడిగా 'తొలి చూపులోనే' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు కళ్యాణ్ రామ్. తన తాత పేరు మీద ఎన్టీఆర్ ఆర్ట్స్ అనే బ్యానర్ స్థాపించి 'అతనొక్కడే' అనే సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే నందమూరి వారసుడు సక్సెస్ అందుకున్నాడు అనుకునే లోపే అర డజనుకు పైగా ప్లాపులు పలకరించాయి. 'అసాద్యుడు' 'విజయదశమి' 'హరే రామ్' 'జయీభవ' 'కళ్యాణ్ రామ్ కత్తి' సినిమాలు పరాజయం పాలయ్యాయి. ఆ తర్వాత వచ్చిన 'పటాస్' సినిమాతో కళ్యాణ్ రామ్ కెరీర్ లో మంచి హిట్ అందుకున్నాడు. అయితే కంటిన్యూగా హిట్స్ లేకపోవడం వల్ల రేస్ లో నిలబడలేకపోయాడు.
ఇక ఈ ఏడాది ప్రారంభంలో 'ఎంత మంచివాడవురా' అంటూ సంక్రాంతి బరిలో నిలిచినా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాడు. అయితే కాస్త గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ రామ్ మూడు సినిమాలు లైన్ లో పెట్టడాని సమాచారం. కానీ ఇంతవరకు ఒక్క సినిమా గురించి కూడా అప్డేట్ ఇవ్వలేదు. సైలంట్ గా సినిమాలు తీసి, ప్రమోషన్స్ టైమ్ లో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయాలని కళ్యాణ్ రామ్ థింక్ చేస్తున్నట్లుగా సినీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. అయితే ఓవర్ ప్రమోషన్స్ చేస్తేనే సినిమాలకి ఆడియెన్స్ రావడం కష్టంగా ఉన్న ఈరోజుల్లో ఇప్పుడు సైలెంట్ గా సినిమాలు తీస్తే ఓపెనింగ్స్ తీసుకురావడం కూడా కష్టమేమో కాస్త ఆలోచిస్తే బెటర్ అని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.