క‌ళ్యాణ్ రామ్ ఆమెను మాత్ర‌మే క‌న్ఫ‌మ్ అన్నాడు

Update: 2017-01-30 15:52 GMT
జూనియ‌ర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రారంభోత్స‌వానికి రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఇంకో ప‌ది రోజుల్లో ఆ సినిమా ప్రారంభోత్స‌వానికి ముహూర్తం నిర్ణ‌యించారు. ఈ సినిమాకు టెక్నీషియ‌న్స్ అంతా దాదాపుగా ఓకే అయిపోయారు. ఇక తేలాల్సింది హీరోయిన్ల సంగ‌తే. ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్లుండ‌గా.. రాశి ఖ‌న్నా.. నివేదా థామ‌స్ రెండు పాత్ర‌ల‌కు ఖ‌రారైన‌ట్లు వార్త‌లొచ్చాయి. ఐతే చిత్ర నిర్మాత క‌ళ్యాణ్ రామ్ మాత్రం ఒకే హీరోయిన్నే క‌న్ఫ‌మ్ చేశాడు. ఈ రోజు ఎన్టీఆర్ ఆర్ట్స్ అఫీషియ‌ల్ ట్విట్ట‌ర్ అకౌంట్లో ఆ హీరోయిన్ రాశి ఖ‌న్నానే అని ప్ర‌క‌టించారు.

‘‘ఎన్టీఆర్  27వ సినిమాలో ఒకానొక హీరోయిన్ గా అందాల రాశి న‌టిస్తుంది. ఆమెకు స్వాగతం’’ అని ఎన్టీఆర్ ఆర్ట్స్ పేర్కొంది. నివేదా ఈ సినిమాలో న‌టించేట్ల‌యితే రాశితో పాటుగా ఆమె పేరు కూడా ఒకేసారి ప్ర‌క‌టించాలి. అలా చేయ‌లేదెందుకో. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేస్తాడ‌ని వార్త‌లొస్తున్నాయి. ఆ మూడు పాత్ర‌ల‌కూ హీరోయిన్లుంటార‌ట‌. మ‌రి ఆ మిగ‌తా ఇద్ద‌రెవ‌రో ఈ ప‌ది రోజుల్లో తేలిపోవాలి. త్రీ ఇడియ‌ట్స్.. పీకే లాంటి సినిమాల‌కు ఛాయాగ్ర‌హ‌ణం అందించిన ప్ర‌ముఖ బాలీవుడ్ కెమెరామ‌న్ ముర‌ళీధ‌ర‌న్ ఈ చిత్రానికి ప‌ని చేయ‌నున్నాడు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత ద‌ర్శ‌కుడు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే ఈ చిత్రానికి ‘జై ల‌వ‌కుశ’ అనే పేరు అనుకుంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News