తన సోదరుడిలా కాదు.. ప్రియాంక గాంధీకి మర్యాద తెలుసు : కంగనా రనౌత్
కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీని పార్లమెంటులో కలిసినప్పుడు ఆహ్వానించానని కంగన తెలిపారు. జనవరి 17న ఎమర్జెన్సీ విడుదల కానుంది.
మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా రూపొందించిన తాజా చిత్రం 'ఎమర్జెన్సీ' ప్రివ్యూ చూడటానికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీని క్వీన్ కంగన రనౌత్ ఆహ్వానించానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీని పార్లమెంటులో కలిసినప్పుడు ఆహ్వానించానని కంగన తెలిపారు. జనవరి 17న ఎమర్జెన్సీ విడుదల కానుంది. ఈ చిత్రంలో మాజీ ప్రధాని ఇందిర పాత్రను కంగన రనౌత్ స్వయంగా పోషించడమే గాక, ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు.
అయితే ఆహ్వానం ఇవ్వడానికి రాహుల్ గాంధీని కలిసినప్పుడు కంగనాకు అతడి ప్రవర్తన అంతగా నచ్చలేదు. 'అతడికి పెద్దగా మర్యాద తెలీదు' అని కంగనా విమర్శించారు. పార్లమెంటులో ప్రియాంక గాంధీని కలిసి ప్రివ్యూకి ఆహ్వానించినప్పుడు ఆమె మర్యాదగా, నవ్వుతూ సంభాషించారని కంగన తెలిపారు. నాకు అది ఇంకా గుర్తుంది. తన సోదరుడు రాహుల్ గాంధీలా కాకుండా ఆమె (ప్రియాంక గాంధీ) చాలా మర్యాదగా ఉంటారు. ఆమె ఖచ్చితంగా తెలివైనది..తను ఏం మాట్లాడుతుందో స్పష్ఠంగా ఉంటుంది. తనతో మాట్లాడటం నాకు నిజంగా ఇష్టం అని కంగన అన్నారు. ప్రియాంక సోదరుడికి పెద్దగా మర్యాద తెలీదు. కానీ నేను కూడా అతడిని సినిమా చూడమని ఆహ్వానించాను అని కంగన తెలిపింది.
ఇది 1975 నుండి 1977 వరకు ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితి, దాని పర్యవసానాలపై తెరకెక్కిన సినిమా ఎమర్జెన్సీ. ఆ సమయం భారత రాజకీయ చరిత్రలో అత్యంత అల్లకల్లోలమైనది...ఇందిరాగాంధీ పాత్రను ఎంతో గౌరవప్రదంగా తెరపై చూపించానని కంగన అన్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సి) ఎమర్జెన్సీకి యుఏ సర్టిఫికేట్ మంజూరు చేసింది.