కుటుంబ కథా చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో 'ఎంత మంచివాడవురా' సినిమా చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కి రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తేది చెప్పకుండా రిలీజ్ లాక్ చేసుకున్నారు. 2017 లో 'ఖైదీ 150' , 'గౌతమి పుత్ర శాతకర్ణి' వంటి పెద్ద సినిమాల మధ్య చిన్న సినిమాగా విడుదలై ఘన విజయం సాధించింది 'శతమానం భవతి'.
ఇప్పుడు మళ్లీ అదే మేజిక్ ని రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నాడు సతీష్ వేగేశ్న. ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కించిన 'శతమానం భవతి' విడుదల చేసిన సంక్రాంతి సీజన్ కే మళ్లీ తన అప్ కమింగ్ సినిమాను రిలీజ్ చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ తో ఎంత మంచి వాడవురా అనిపించుకోవాలని చూస్తున్నారు. ఫీల్ గుడ్ ఫ్యామిలీ సినిమా ,పైగా నాలుగు సినిమాలు ఆడే పెద్ద ఫెస్టివల్ సీజన్ కావడంతో సంక్రాంతి కి సినిమాను థియేటర్స్ లోకి దింపి మళ్లీ ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ రప్పించాలని భావిస్తున్నాడు. సో మహేష్ 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ 'అల వైకుంఠ పురములో' తో పాటు కళ్యాణ్ రామ్ సంక్రాంతి బరిలో నిలిచాడు.
ఇప్పటికే సినిమాకు సంబంధించి ఒక షెడ్యుల్ పూర్తి చేశారు. నెలాఖరు నుండి రాజమండ్రిలో రెండో షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు. ఒక పది రోజుల పాటు అక్కడ కొన్ని సీన్స్ షూట్ చేయనున్నారు. శ్రీ దేవి మూవీస్ సమర్పణలో ఆదిత్య మూవీస్ బ్యానర్ పై ఉమేష్ గుప్త ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపి సుందర్ మ్యూజిక్ కంపోజర్.