మెగా బ్రదర్‌ తో పోలిక ఉందిలే!!

Update: 2015-10-11 22:30 GMT
నిన్నటి ఫంక్షన్‌ లో ''షేర్‌'' అభిమానులు 'జై బాలయ్య' అని అరుస్తున్న తరుణంలో.. ఎంతో ఎమోషనల్‌ గా కళ్యాణ్‌ రామ్‌ 'దయ చేసి నందమూరి ఫ్యామిలీని వేరు చేసి మాట్లాడకండి' అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఒక్క క్షణం కళ్యాణ్‌ రామ్‌ ను చూడగానే చాలామంది మెగా బ్రదర్‌ నాగబాబు గుర్తొచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన కూడా అక్కడ ఇలాంటి సిట్యుయేషన్‌ నే ఎదుర్కొంటున్నాడు మరి.

మెగా ఫంక్షన్లలో అక్కడికొచ్చిన మెగా హీరోలు చెప్పేది వినకుండా.. 'పవర్‌ స్టార్‌' అంటూ ఒక వర్గం అభిమానులు అరుస్తుంటే ఎలా ఉంటుందో.. ఇక్కడ నందమూరి ఫంక్షన్లలో ఒక ఫ్యామిలీ మెంబర్‌ మాట్టాడుతున్నప్పుడు కొందరు 'జై బాలయ్య' అంటే సేమ్‌ టు సేమ్‌ అలాగే ఉంటుంది. ఎన్నోసార్లు సున్నితంగా చెప్పడానికి ప్రయత్నించీ ప్రయంత్నించీ మెగా బ్రదర్‌ నాగబాబు చివరకు మొన్నోసారి ఫైర్‌ అయిపోయాడు. ఇప్పుడిక కళ్యాణ్‌ రామ్‌ కూడా సున్నితంగా చెప్పే ప్రయత్నమే చేస్తున్నాడు. తదుపరి సీన్‌ ఎలా ఉంటుందో తెలియదు కాని.. ఆ క్యాంపులో నాగబాబు.. ఈ క్యాంపులో కళ్యాణ్‌ రామ్‌ అంటూ ఇప్పటికే ఈ ఇద్దరినీ ఒకే కోణంలోంచి చూస్తున్నారు సినిమా అభిమానులు.

ఇకపోతే ఇలా నాగబాబులూ.. కళ్యాణ్‌ రామ్‌ లూ.. అభిమానులకు సర్దిచెప్పేబదులు.. పవన్‌.. బాలయ్య.. స్వయంగా రంగంలోకి దిగి ఎన్నో మ్యాటర్లను సెటిల్‌ చేస్తే బెటర్‌ అని అంటున్నారు అభిమానులు.
Tags:    

Similar News