ప్రేక్షకుల దృక్పధంలో మార్పు వచ్చిందో లేక దర్శకుల క్రియేటివిటీకి పదును పెరిగిందో కాని మొత్తానికి టాలీవుడ్ లో పాత ట్రెండ్ మళ్ళి ఊపిరి పోసుకుంటోంది. ఆధునిక సినిమా ప్రేమికుడు ఎక్కువ సేపు థియేటర్లో కూర్చోలేడు అనే నమ్మకాన్ని బ్రేక్ చేస్తూ ఈ మధ్య మూడు గంటల సినిమాలన్నీ ఘన విజయం సాధించడం దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అర్జున్ రెడ్డి-రంగస్థలం-భరత్ అనే నేను-మహానటి అన్ని కూడా మూడు గంటల దరిదాపుల్లో వ్యవధి ఉన్నా కూడా ఏ మాత్రం విసిగించకుండా ప్రేక్షకుల చేత చప్పట్లు వసూళ్లు రెండూ రాబట్టుకున్నాయి. కాని నందమూరి హీరో కళ్యాణ్ రామ్ దీనికి పూర్తి భిన్నమైన రూట్ లో వెళ్దాం అంటున్నాడట. అతని కొత్త సినిమా నా నువ్వే పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఇప్పటికే విడుదలైన ఆడియో యూత్ కి బాగానే కనెక్ట్ అవుతోంది.
ఈ నేపధ్యంలో దీని లెంగ్త్ విషయంలో పలు చర్చలు జరిగిన మీదట నా నువ్వే ఫైనల్ వెర్షన్ ని 118 నిమిషాలకు కట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అంటే రెండు గంటల కంటే రెండు నిమిషాలు తక్కువ అన్నమాట. సున్నితమైన ప్రేమ కథ కనుక ఎమోషన్ ఫీల్ కావాలి అంటే మరీ ఎక్కువ లెంగ్త్ అవసరం లేదని ఫీల్ అయిన దర్శకుడు జయేంద్ర-హీరో కళ్యాణ్ రామ్ దీని వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఇందులో చిన్నా పెద్ద కలిపి మొత్తం 7 పాటలు ఉన్నాయి. వాటి వ్యవధి 22 నిముషాలు. వీటిని తీసేసే చూసుకుంటే టాకీ పార్ట్ ఉన్న సినిమా అటు ఇటుగా గంటన్నర మాత్రమే ఉంటుంది. సో మరీ ఇంత షార్ట్ గా స్వీట్ లవ్ స్టొరీ ఎలా చెబుతారు అనే ఆసక్తి మొదలైంది. ఒకరకంగా ఇది మంచి నిర్ణయమే అనుకోవాలి. ఎంత డ్యురేషన్ అనే దాని కంటే కంటెంట్ ని ఎంత బాగా ప్రెజెంట్ చేసాము అనేదే ముఖ్యం కదా. సో కళ్యాణ్ రామ్ నిర్ణయం కరెక్ట్ అనుకోవచ్చు.