నందమూరి హీరో.. సొంత కుంపటే మేలు

Update: 2015-11-01 17:30 GMT
పన్నెండేళ్ల కెరీర్.. అందులో హీరోగా 13 సినిమాలు. కానీ అందులో హిట్టయిన సినిమాలు రెండంటే రెండు. ఇదీ నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్. సక్సెస్ రేట్ ఇంత తక్కువగా ఉండి కూడా ఇంకా హీరోగా నిలబడి ఉండటం గొప్ప విషయమే. అందుకు సొంత బేనర్ బ్యాకప్ ఉండటమే కారణం అనడంలో సందేహం లేదు. కళ్యాణ్ రామ్ కొట్టిన రెండు హిట్లూ కూడా సొంత బేనర్లో వచ్చినవే. ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బేనర్లో ఫ్లాపులూ లేకపోలేదు. కానీ సక్సెస్ రేట్ కూడా ఉంది. ఆ హిట్టయిన రెండు సినిమాలూ కూడా బ్లాక్ బస్టర్లే. కానీ బయటి బేనర్లకు చేసిన సినిమాలు దారుణమైన ఫలితాలనిచ్చాయి. దాదాపుగా అన్నీ డిజాస్టర్లే.

కళ్యాణ్ రామ్ చాన్నాళ్ల తర్వాత బయటి బేనర్లో చేసిన సినిమా ‘షేర్’. ఇది అతడి కెరీర్ కే మచ్చగా మిగిలిపోయేలా ఉంది. సొంత బేనర్లోనూ కళ్యాణ్ రామ్ డిజాస్టర్లు ఇచ్చినప్పటికీ.. అవి అతడి పేరును చెడగొట్టలేదు. హరే రామ్, కత్తి లాంటి సినిమాలు పర్వాలేదనిపించుకున్నాడు. కళ్యాణ్ రామ్ ఏదో ట్రే చేస్తున్నాడని జనాల్లో పాజిటివ్ ఫీలింగ్ కలిగేలా చేశాయి. ఓం త్రీడీ విషయంలోనూ కళ్యాణ్ రామ్ పడ్డ కష్టాన్ని జనాలు గుర్తించారు. కానీ బయటి బేనర్లకు చేసిన సినిమాలే అతడికి చెడ్డ పేరు తెచ్చిపెట్టాయి. బహుశా సొంత బేనర్లో సినిమా తీస్తే ఎక్కువ జాగ్రత్త పడుతున్నాడేమో, సినిమాల్లో బాగా ఇన్వాల్వ్ అవుతున్నాడేమో. కాబట్టి ఇకపైనా నందమూరి మళ్లీ సొంత బేనర్లోనే సినిమాలు చేసుకుంటే మేలేమో.
Tags:    

Similar News