రకరకాల జోనర్లలో సినిమాలు చేయడం అంటే నందమూరి కళ్యాణ్ రామ్ కు మహా ఇష్టమైన విషయం. ఎక్కువగా మాస్ సినిమాలు చేసినా.. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేసేందుకు ఏ మాత్రం సందేహించడు. స్క్రిప్ట్ నచ్చిందంటే చాలు.. క్యారెక్టర్ ను కూడా అంతగా పట్టించుకోకుండా మూవీస్ చేస్తానంటాడు ఈ నందమూరి హీరో.
ప్రస్తుతం ఎమ్మెల్యే అంటూ ఓ చిత్రంలో నటిస్తున్నాడు కళ్యాణ్ రామ్. మరోవైవు నీ నువ్వే అంటూ ఓ ప్యూర్ లవ్ స్టోరీని కూడా పూర్తి చేసేస్తున్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యే నిర్మాతలకే మరో మూవీకి కమిట్ అయ్యాడనే న్యూస్ వినిపిస్తోంది. విజయ్ మద్దాల రాసిన ఓ స్క్రిప్ట్ కు ఫుల్లుగా ఫ్లాట్ అయిపోయాడట ఈ హీరో. రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా డిఫరెంట్ గా ఉండడంతో.. వెంటనే ఆ స్క్రిప్ట్ కి కనెక్ట్ అయిపోయాడని.. తప్పకుండా సినిమా చేద్దామని అన్నాడట. రైటర్ విజయ్.. తనే దర్శకత్వం వహించి ఈ మూవీని రూపొందించేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తోంది.
ప్రేమకథకు.. మిస్టరీని మిక్స్ చేసి కథను రూపొందించిన తీరు కళ్యాణ్ రామ్ కు బాగా నచ్చేసిందట. ఈ మిస్టరీ ఎలిమెంట్ సినిమాకు చాలా కీలకం అని తెలుస్తోంది. విజయ్ రాసిన స్క్రిప్ట్ కి ప్రస్తుతం కోన వెంకట్ ఫైనల్ టచ్ ఇస్తున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశాలున్నాయి. ఎమ్మెల్యేను నిర్మిస్తున్న బ్లూ ప్లానెట్ ఎంటర్టెయిన్మెంట్స్ తో పాటు.. పీపుల్ మీడియా ఈ చిత్రానికి నిర్మాతలు.