కళ్యాణ రాముడి మాస్టర్ ప్లాన్

Update: 2015-09-13 15:30 GMT
వరుసపెట్టి పరజాయల బాట పట్టినా పట్టు వదలని గజినీ మహమ్మద్ లా దండయాత్ర చేసి ఎట్టకేలకు 'పటాస్'తో హిట్ కొట్టాడు. కేవలం సినిమాపై వున్న ప్రేమతోనే ఎంతటికష్టమైనా పడతారన్నదానికి కళ్యాణ్ రామ్ నిదర్శనం. హీరోగానేకాక కళ్యాణ్ రామ్ ఆర్ట్స్ బ్యానర్ తో నిర్మాతగా కూడా కళామతల్లికి సేవ చేస్తున్నాడు.

ప్రస్తుతం 'షేర్' సినిమాతో మనల్ని అలరించడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసినదే. అయితే కళ్యాణ్ రామ్ నిర్మాతగా చివరిగా తెరకెక్కిన కిక్ 2 చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది. ఈ సినిమా బ్యానర్ ఇమేజ్ ని వాణిజ్యపరంగా బాగా దెబ్బతీసినట్టు సమాచారం. అయితే నందమూరి వంశంవారికి వున్న ఏకైక సొంత బ్యానర్ కాబట్టి దీన్ని తిరిగి పూర్వవైభవాన్ని సంతరించే పనిలో కళ్యాణ్ రామ్ ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది.

కళ్యాణ్ రామ్ కి బాలయ్య బాబు మరియు తారక్ తో మంచి సాన్నిహిత్యం వుందికాబట్టి వీరిద్దరి తోనూ విడివిడిగా తన బ్యానర్ లో సినిమాలు చేసేందుకు ఒప్పించినట్టు సమాచారం. ఇదే గనుక కార్యరూపం దాల్చితే తిరిగి నందమూరి బ్యానర్ కి మళ్లీ మంచిరోజులు వచ్చినట్టే.
Tags:    

Similar News