ఎన్టీఆర్ జీవిత చరిత్ర తెరపైన ఎప్పుడు చూస్తామో ఎలా చూస్తామో గాని షూటింగ్ మొదలుకాక ముందే ఆ ప్రాజెక్ట్ రోజుకో ట్విస్ట్ తో సినిమాను చూపిస్తోంది. బాలకృష్ణ - తేజ కాంబినేషన్ సెట్ అయినప్పటి నుండి ఎన్టీఆర్ జీవితంలో కీలకంగా చెప్పుకునే పాత్రలకు ఎవరిని సెలెక్ట్ చేస్తారని రోజుకో న్యూస్ మీడియాలో ప్రసారం అవుతోంది. అయితే రీసెంట్ గా సినిమాలో ఒక పాత్రకు హీరో కళ్యాణ్ రామ్ ని ఫైనల్ చేశారనే టాక్ వినిపిస్తోంది.
తేజ ఇప్పటికే కథను మొత్తం రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. స్క్రీన్ ప్లే లో సీనియర్ రచయితల హెల్ప్ కూడా తీసుకుంటున్నాడట. అయితే పాత్రల విషయంలో తేజ బయటి వారితో పాటు ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంభందించిన వారిని కూడా సెలెక్ట్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ రాజకీయ చరిత్రలో కీలకంగా వ్యవహరించిన హరికృష్ణ పాత్రలో ఆయన కుమారుడినే తేజ ఫైనల్ చేశాడు. ఇంతకు ముందు తేజ- కళ్యాణ్ రామ్ తో లక్ష్మి కళ్యాణం సినిమా చేసిన సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ పొలిటికల్ కెరీర్ లో చైతన్యరథం (ఒక టెంపో వెహికల్) పైనే ఎన్టీఆర్ 75వేల కిలోమీటర్లు ప్రయాణం చేశారు. ఆ రథాన్ని ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణ నడిపాడు. అప్పట్లో ఆ యాత్ర సంచలనం సృష్టించింది. దీంతో హరికృష్ణ పాత్రకు కళ్యాణ్ రామ్ అయితేనే బెస్ట్ అని చిత్ర యూనిట్ ఫైనల్ భావిస్తోందట. ప్రస్తుతం మరికొంత మంది ముఖ్య పాత్రలను కూడా సెలెక్ట్ చేయాల్సి ఉంది. ఇప్పటికే జగపతిబాబు చంద్రబాబు పాత్రలో చేయనున్నారనే టాక్ కూడా వచ్చింది. బాలకృషతో పాటు సాయి కొర్రపాటి - విష్ణు ఇందూరి కూడా నిర్మాతలుగా ఉన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నారు.