కొత్త టెక్నీషియన్స్ తో విభిన్నమైన కాన్సెప్టులను తెరకెక్కించడంలో నందమూరి వారసుడు కళ్యాణ్ రామ్ ముందుంటాడు. మొదట్లో బాగానే సెట్ అయినా.. ఓం 3డీ మూవీ ఇతడిని బాగా దెబ్బకొట్టింది. ఆర్థికంగానే కాదు.. ప్రయోగాల విషయంలో ఒకటికి నాలుగుసార్లు ఆలోచించుకునేలా చేసింది. తర్వాత వరుసగా కమర్షియల్ సినిమాలే చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఈ ఏడాది ప్రారంభంలో పటాస్ తో మంచి హిట్ కూడా సాధించాడు. ప్రస్తుతం షేర్ అంటూ మరో మాస్ ఎంటర్టెయినర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడీ నందమూరి హీరో. మరో రోజులో ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.
అయితే.. ప్రయోగాల విషయంలో ఇప్పుడొచ్చింది బ్రేక్ అంతే అంటున్నాడు కళ్యాణ్ రామ్. మూడేళ్లు శ్రమించి, ఇదే జీవితం అనుకుని చేసిన ఓం 3డీ మూవీని చేశాడు కళ్యాణ్ రామ్. 3డీ టెక్నాలజీ కూడా లింక్ చేయడంతో బాగానే ఖర్చయింది, టైం కూడా ఎక్కువే పట్టింది. అయితే.. ఫ్లాష్ బ్యాక్ ఎక్కువగా నేరేట్ చేయడం - కామెడీ లేకపోవడంతో ఫెయిల్యూర్ వచ్చిందన్న కళ్యాణ్ రామ్.. ఈసారి మరింత పక్కాప్లాన్ తో ప్రజల ముందుకొస్తానని చెప్పాడు. ప్రయోగాలు చేయకపోతే మనసు ఊరుకోదట. అందుకోసమైనా ఎక్స్ పెరిమెంట్స్ చేస్తానని చెప్పడం హైలైట్.
నిజానికి ఓం 3డి రేంజ్ దెబ్బ తగిలిన తరువాత.. అసలు ఇంకో హీరో ఎవరైనా అయితే కొన్ని దశాబ్దాల పాటు ప్రయోగాలకు దూరం అంటారు. కాని మనోడు మాత్రం అబ్బే నాకు అలాంటి పట్టింపులే లేవ్ అంటున్నాడు.. అంతే కాదు.. త్వరలో ఆలాంటి ప్రాజెక్టు ఒకటి స్టార్టు చేస్తున్నానంటూ చెప్పడం చూస్తే మాత్రం సినిమా అంటే ప్యాషన్.. అ బ్లడ్ లోనే ఉందిలే అనిపించకమానదు.