తన కొత్త సినిమాకు ‘ఎమ్మెల్యే’ అని పేరు పెట్టుకుని జనాల దృష్టిని ఆకర్షించాడు నందమూరి కళ్యాణ్ రామ్. పైగా ఈ చిత్రంలో పొలిటికల్ డైలాగులు కూడా పేల్చాడు. ఇందులో ఎమ్మెల్యే పదవి కోసం పోటీ చేసే పాత్రలో కనిపించనున్నాడతను. మొన్న జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్లో కళ్యాణ్ రామ్ రాజకీయాల్లోకి వచ్చి.. ఎమ్మెల్యే కావాలన్న ఆకాంక్ష వ్యక్తమైంది అతిథుల్లో. దీంతో ఈ నందమూరి హీరో భవిష్యత్ గమనంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది ఇండస్ట్రీలో ప్రస్తుతం. ఇదే విషయం కళ్యాణ్ రామ్ దగ్గర ప్రస్తావిస్తే తాను రాజకీయాల్లోకి రాబోననేమీ చెప్పలేదు. వస్తానన్నాడు. కానీ దానికో మెలిక పెట్టాడు.
ఫేస్ బుక్ లో చిట్ చాట్ సందర్భంగా ఓ అభిమాని మీరెప్పుడు రాజకీయాల్లోకి అడుగు పెడతారని అడిగితే.. ‘‘మీరు ఇక సినిమాలు చేయడం ఆపండి.. ఇక చాలు.. అని ప్రేక్షకులు చెప్పినపుడు రాజకీయాల్లోకి వస్తాను’’ అని బదులిచ్చాడు కళ్యాణ్ రామ్. అయినా ఇక సినిమాలు మానేయమని ఎవరైనా ఏ హీరోకైనా చెబుతారా? కెరీర్ దెబ్బ తిని భవిష్యత్ కనిపించనపుడు హీరో వేరే రంగాల వైపు చూస్తారేమో? నిజానికి దశాబ్దంన్నర కిందట్నుంచి సినిమాల్లో ఉన్నప్పటికీ కళ్యాణ్ రామ్ కెరీర్లో విజయాలు తక్కువే. ప్రస్తుతం అతడి కెరీర్ ఏమంత గొప్పగా లేదు. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు మంచి ఫలితాలు అందుకుంటే ఓకే. లేని పక్షంలో సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వస్తాడేమో చూద్దాం.