స్టార్ ప్రొడ్యూస‌ర్ కు క‌ల్యాణ్ రామ్ నో చెప్పాడా?

Update: 2022-07-14 14:30 GMT
టాలీవుడ్ లో క్రేజీ సినిమాల రిలీజ్ లు అప్పుడ‌ప్పుడు క్లాష్ అవుతుండ‌టం కామ‌నే. అయితే కొంత మంది మ‌న‌కు క్లాష్ ఎందుక‌ని త‌ప్పుకుంటూ మ‌రో రిలీజ్ డేట్ కు వెళ్లిపోతుంటారు. కొంత మంది మాత్రం సినిమాపై వున్న న‌మ్మ‌కంతో క్లాష్ వున్న కంటెంట్ డిఫ‌రెంట్ కాబ‌ట్టి మా సినిమాకు వ‌చ్చే ఇబ‌బ్ందేమీ లేద‌ని అదే డేట్ కు ఫిక్స‌వుతుంటారు. ఎంత మంది ఎన్ని ర‌కాలుగా రిలీజ్ డేట్ విష‌యంలో స‌ల‌హాలు ఇచ్చినా పెద్ద‌గా ప‌ట్టించుకుకోరు ఇప్ప‌డు నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ కూడా ఇదే పంథాని అనుస‌రిస్తున్నార‌ట‌.

వివ‌రాల్లోకి వెళితే..ఈ ఏడాది సంక్రాంతి సీజ‌న్ లో ప‌వ‌న్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన 'భీమ్లానాయ‌క్‌' బ‌రిలోకి దిగాల‌ని మేక‌ర్స్ రిలీజ్ డేట్ ని కూడా లాక్ చేసుకున్నారు. అయితే అదే స‌మ‌యంలో రాజ‌మౌళి  'RRR', ప్ర‌భాస్ 'రాధేశ్యామ్‌' కూడా రిలీజ్ కు డేట్ ల‌ని లాక్ చేసుకున్నాయి. ఈ రెండు పాన్ ఇండియా సినిమాల‌తో 'భీమ్లానాయ‌క్‌' పోటీప‌డి ఆ సినిమాల మార్కెట్ ని దెబ్బ‌తీయ‌డం ఎందుక‌ని దిల్ రాజు మ‌ధ్య‌వ‌ర్తిత్వాన్ని న‌డిపి మొత్తానికి ప‌వ‌న్ సినిమాని సంక్రాంతి బ‌రి నుంచి త‌ప్పుకునేలా చేశారు.

స‌రిగ్గా ఇలాంటి స‌ర్ధుబాటు కోసం మ‌రో సారి దిల్ రాజు రంగంలోకి దిగార‌ట‌. నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ న‌టిస్తున్న ఫాంట‌సీ పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామా 'బింబిసార‌'. మ‌ల్లిడి వ‌శిష్ట ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్న ఈమూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై కె. హ‌రికృష్ణ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే ట్రైల‌ర్ రిలీజ్ చేసిన ఈ మూవీని ఆగ‌స్టు 5న భారీ స్థాయిలో థియేట‌ర్ల‌లో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌బోతున్నారు.

ఇదే తేదీని యంగ్ హీరో నిఖిల్ న‌టించిన మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ 'కార్తికేయ 2' కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది. డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ గా ద్వార‌క నేప‌థ్యంలో రూపొందిన ఈ మూవీని గ్రాఫిక‌ల్ వండ‌ర్ గా తెర‌కెక్కించారు. చందూ మొండేటి అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా రూపొందించిన ఈ మూవీ జూలై 22న విడుద‌ల కావాల్సింది.

కానీ అనివార్య కార‌ణాల‌వల్ల రిలీజ్ డేట్ ని ఆగ‌స్టు 5 కు మార్చేశారు. దిల్ రాజు నిర్మించిన 'థాంక్యూ' మూవీ జూలై 22న విడుద‌ల కానున్న నేప‌థ్యంలో దిల్ రాజు రిక్వెస్ట్ చేయ‌డం వ‌ల్లే 'కార్తికేయ 2' టీమ్ త‌మ సినిమా రిలీజ్ డేట్ ని జూలై 22 నుంచి ఆగ‌స్టు 5  కు మార్చేసింది.

అయితే ఈ మూవీకి క్లాష్ కాకూడ‌ద‌ని క‌ల్యాణ్ రామ్ సినిమాని దిల్ రాజు పోస్ట్‌పోన్ చేసుకోమ‌ని ఓ ప్ర‌పోజ‌ల్ తీసుకొచ్చార‌ట‌. కానీ క‌ల్యాణ్ రామ్ మాత్రం ఆ ప్రపోజ‌ల్ కు అంగీక‌రించ‌లేద‌ని, తను న‌టించిన 'బింబిసార‌' ని ఆగ‌స్టు 5నే విడుద‌ల చేస్తాన‌ని చెప్పిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదే రోజున బింబిసార‌, కార్తికేయ 2 తో పాటు దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టిస్తున్న 'సీతా రామ‌మ్‌' కూడా పోటీప‌డ‌బోతోంది. దీంతో ఈ మూడు సినిమాల మ‌ధ్యే బాక్సాఫీస్ వార్ నెల‌కొన‌బోతోంద‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News