ఏం చేయాలి.. ఎలా మెప్పించాలి?

Update: 2018-06-19 04:47 GMT
అలవాటయిన.. పేరొచ్చిన జోనర్ లో సినిమాలు చేస్తూ వస్తే రొటీన్ సినిమాలు అనేస్తారు. పోనీ అలాగని మొత్తం స్టయిల్ మార్చి ఇంతవరకు కనిపించని ఓ కొత్త జోనర్ లో సినిమా చేస్తే సెట్ అవలేదంటారు. అలాంటప్పుడు ఎలా చేయాలి.. ప్రేక్షకులను ఎలా మెప్పించాలి... నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కు ప్రస్తుతం అంతుపట్టని ప్రశ్నే ఇదే అనుకోవచ్చు.

కళ్యాణ్ రామ్ కెరీర్లో ఎక్కువగా యాక్షన్ సినిమాలు.. మాస్ ఎంటర్ టెయినర్లు చేసుకుంటూ వచ్చాడు. తొలిసారి ఓ సరికొత్త లుక్ తో నానువ్వే సినిమా చేశాడు. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ. కళ్యాణ్ రామ్ లుక్ కొత్తగా ఉన్నా సినిమాలో విషయం తక్కువగా ఉండటంతో నానువ్వే బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అది కూడా కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అతిపెద్ద ఫ్లాప్ అనే ముద్ర కూడా సంపాదించుకుంది. నానువ్వే రిజల్ట్ ఈ హీరోని తీవ్ర షాక్ కు గురిచేసిందని అతడి సన్నిహితులు చెబుతున్నారు. కొత్తదనంతో ఉండేలా సినిమా చేస్తే మరి ఇంత దారుణమైన రిజల్ట్ వస్తుందని ఎక్స్ పెక్ట్ చేయలేదని ఆవేదనతో ఉన్నాడట.

కళ్యాణ్ రామ్ కెరీర్ లో అతిపెద్ద హిట్ పటాస్ మూవీతో దక్కింది. ఆసినిమా రూ. 15 కోట్ల దాకా వసూలు చేసింది. దీంతో రూ. 10 కోట్లు - రూ. 15 కోట్ల రేంజ్ హీరోల్లో కళ్యాణ్ రామ్ కొనసాగుతాడని అంతా భావించారు. తరవాత వచ్చిన షేర్ - ఇజం - ఎం.ఎల్.ఎ. వరసగా మూడూ పరాజయం పాలయ్యాయి. వరస ఫ్లాపులతో అతడి సినిమాల స్థాయి పడుతూ వచ్చింది. అందుకే నానువ్వే సినిమాకు అతితక్కువ కలెక్షన్లే వచ్చాయి. మళ్లీ పటాస్ నాటి స్థాయికి చేరాలంటే ఓ సూపర్ హిట్ పడాలి.
Tags:    

Similar News