కెరీర్ ఆరంభం నుంచి మాస్ సినిమాలే చేస్తున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. తొలిసారిగా అతను తన పంథాకు పూర్తి భిన్నమైన చిత్రంలో నటించాడు. అదే.. నా నువ్వే. ‘180’ లాంటి క్లాస్ లవ్ స్టోరీ తీసిన జయేంద్ర దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇందులో కళ్యాణ్ రామ్ లుక్.. బాడీ లాంగ్వేజ్ విషయంలో చాలా మార్పు కనిపిస్తోంది. తన పాత్ర కూడా చాలా కొత్తగా ఉంటుందని.. దీన్ని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని టెన్షన్ గా ఉందని అంటున్నాడు కళ్యాణ్ రామ్.
ఐతే విడుదల తర్వాత జనాలు ఎలా స్పందిస్తారో కానీ.. ఇప్పటికైతే ఒక వ్యక్తి తనకు గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చేశాడని కళ్యాణ్ రామ్ తెలిపాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు.. కళ్యాణ్ రామ్ కొడుకు శౌర్య రామ్. ‘‘మా అబ్బాయి ఈ సినిమాలో నన్ను చూసి.. నాన్నా ఇప్పటిదాకా చేసిన అన్ని సినిమాల్లో కంటే ఇందులో చాలా బాగున్నావు. అందంగా కనిపిస్తున్నావు అన్నాడు. అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్’’ అని కళ్యాణ్ రామ్ తెలిపాడు.
‘నా నువ్వే’ సినిమాలో తాను పీహెచ్డీ పూర్తి చేసి ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్లాలనుకునే కుర్రాడి పాత్రలో నటిస్తున్నాని.. కొంచెం ఇగో ఎక్కువ ఉన్న పాత్ర ఇదని.. ఆ పాత్రలో ఇంకో షేడ్ కూడా ఉంటుందని.. అదేంటో తెరమీదే చూడాలని కళ్యాణ్ రామ్ అన్నాడు. మాస్ సినిమాల్లో చేస్తున్నపుడు శారీరక కష్టం చాలా ఉంటుందని.. రొమాంటిక్ సినిమాల్లో మానసిక శ్రమ ఎక్కువని.. ఇందులో రొమాంటిక్ సీన్లలో చేయడానికి చాలా కష్టపడ్డానని.. తాను ఈ విషయంలో చాలా వీక్ అని.. కానీ దర్శకుడు జయేంద్ర తనతో బాగానే చేయించాడని చెప్పాడు కళ్యాణ్ రామ్.