పూరీ మళ్లీ బ్యాంకాక్ బయల్దేరాడు

Update: 2016-06-22 03:30 GMT
దర్శకుడు పూరీ జగన్నాథ్ తను ఏ సినిమా తీసినా.. బ్యాంకాక్ లో సగం సినిమా తీసేసేందుకు ట్రై చేస్తాడు. అటు పూరీకి ఫేవరేట్ ప్లేస్ అవడం.. ఆయనకు ఇది సొంతిల్లులా అనిపించడంతో.. అక్కడి లొకేషన్స్ లోనే సినిమాని నడిపించేయడం పూరీకి ఆనవాయితీ. పైగా స్పీడ్ గా మూవీని తెరకెక్కించే ఛాన్స్ ఉండడం మరో అడ్వాంటేజ్.

ఇప్పుడు నందమూరి కళ్యాణ్ రామ్ తో ఓ చిత్రాన్ని తీస్తున్న పూరీ.. మళ్లీ బ్యాంకాక్ షెడ్యూల్ కి బయల్దేరనున్నాడు. ఇప్పటికే హైద్రాబాద్ లో ఓ కీలక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ మూవీకి.. రెండో షెడ్యూల్ ని బ్యాంకాక్ లోనే ప్లాన్ చేశారు. అక్కడ నెల రోజులకు పైగా షూటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కొన్ని పాటలతో పాటు.. ప్రధానమైన సన్నివేశాలు కూడా ఇక్కడే తెరకెక్కించనున్నారట. ఒకటి రెండు ఫైట్స్ కూడా పిక్చరైజ్ చేస్తారని తెలుస్తోంది.

బ్యాంకాక్, హాంగాంగ్ లలో పలు అందమైన లొకేషన్లలో కళ్యాణ్ రామ్ మూవీని తెరకెక్కించేలా పూరీ ప్లాన్ చేశాడు. ఇప్పటినే నందమూరి హీరోకి సంబంధించిన కొత్త అవతారం ఎలా ఉంటుందో చూపించిన పూరీ జగన్నాథ్.. సినిమా కూడా మరింత విభిన్నంగా తెరెక్కిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ మూవీలో జగపతి బాబు ఓ కీలక పాత్ర పోషించనుండడం విశేషం.
Tags:    

Similar News