సంతోష్ శోభన్ - ప్రియా భవానీ శంకర్ నాయకానాయికలుగా నటించిన చిత్రం `కళ్యాణం కమనీయం`. అనీల్ కుమార్ ఆళ్ల దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ట్రైలర్ ఆకట్టుకున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 14న సినిమా విడుదల కానుంది. పరిమిత బడ్జెట్ సినిమాల్లో సేఫ్ జోన్ లో ఉన్న చిత్రమిదని చిత్రబృందం చెబుతోంది.
సాంకేతికంగా ఉన్నత విలువలతో తెరకెక్కించినా అనుకున్న బడ్జెట్ లో పూర్తయింది. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే బడ్జెట్ ను రికవరీ అయింది. OTT-శాటిలైట్ హక్కుల రూపంలో 7 కోట్లు దక్కింది. దీంతోనే మొత్తం పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టామని టీమ్ చెబుతోంది. ఇక థియేట్రికల్ రిలీజ్ అనేది అదనపు బోనస్ అవుతుంది.
సంక్రాంతికి విడుదల చేస్తే తప్పకుండా సినిమా మంచి వసూళ్లు రాబడుతుందన్న నమ్మకం ఉంది. యూవీ కాన్సెప్ట్స్ తెలివిగా రిలీజ్ తేదీని లాక్ చేశాయి. కాబట్టి నిర్మాతలకు అన్ని విధాలా లాభదాయకమైన సినిమా అవుతుందని విశ్లేషిస్తున్నారు. పరిమిత బడ్జెట్ లో సినిమాలు తీసి తెలివైన మార్కెటింగ్ తో ఎదిగిన నిర్మాణ సంస్థలు టాలీవుడ్ లో ఉన్నాయి. వాటిలో యువి నిర్మాణ సంస్థ అగ్రగామిగా దూసుకుపోతోంది. ఇప్పుడు సంతోష్ శోభన్ తో ఈ సంస్థ వరుస సినిమాలు నిర్మిస్తోంది.
కన్నుల పండుగైన ఫ్రేములతో..!
కళ్యాణం కమనీయం టైటిల్ సాంగ్ ఇటీవలే విడుదలై ఆకట్టుకుంది. శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే మూవీ నుంచి థీమ్ బేస్డ్ పాటలు ఓ మానస ..అయ్యో ఏంటో..హో ఎగిరే.. విడుదలై ఆకట్టుకున్నాయి. పెళ్లి కాన్సెప్టు పైనా పాట ఆకట్టుకుంది.
సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ అందించారు.
ఈ సినిమా కాన్సెప్ట్ ఆసక్తికరం. శివ అనే ఉద్యోగం లేని భర్త అతని వర్కింగ్ వైఫ్ శ్రుతి (ప్రియా భవానీ శంకర్) చుట్టూ చక్కటి సంఘర్షణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుదలవుతోంది. యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.