కళ్యాణం కమనీయం: శ‌ర్వా ప్ర‌భాస్ ఇద్ద‌రినీ బుక్ చేశాడు!

Update: 2023-01-10 16:35 GMT
నేటిత‌రంలో పెళ్లి అంటే ఒక మోత‌... పెళ్లాం అంటే పెద్ద రోత! అని భావించే కుర్రాళ్లు  ఎక్కువ‌య్యారు. మెజారిటీ యూత్ పెళ్లి కోసం త‌ప‌న ప‌డడం లేదు. కానీ ఏదో ఒక రోజు క‌ళ్యాణం అయి తీరుతుంది. దానినే విధి అంటారు!

పెళ్లిపై నేటి జ‌న‌రేష‌న్ ఆలోచ‌న‌ల‌ను ప‌దాలుగా మార్చి పొందిక‌గా పేర్చి ఒక అంద‌మైన పాట‌ను సృజించారు. ఆ పాట ఇదిగో ఇలా `క‌ళ్యాణం క‌మ‌నీయం` రూపంలో హాయిగా ఆహ్లాద‌క‌రంగా ఆక‌ట్టుకుంది. కళ్యాణం కమనీయం లిరిక‌ల్ సాంగ్ ఆద్యంతం బ్యాచిల‌ర్ల‌కు ఒక పాఠంలా సాగింది. ఈ గీతం దాంపత్య ఆనందాన్ని అత్యంత వాంఛనీయమైనది అని వ‌ర్ణిస్తుంది. శర్వానంద్ పెళ్లి అంటే గిట్ట‌ని వాడిగా పాట‌లో క‌నిపించారు. చివ‌రికి ప్ర‌భాస్ కే ఫోన్ చేసి ఏదో చెబుతున్నాడు మ‌రి!! అంత‌గా ఏమార్చేలా ఏం నూరి పోసాడో కానీ.. సంతోష్ క‌న్విన్సింగ్ పెర్ఫామెన్స్ క‌ల‌ర్ ఫుల్ ఫ్రేముల‌తో ఆక‌ట్టుకుంది.

సంతోష్ శోభ‌న్ క‌థానాయ‌కుడిగా న‌టించిన సినిమా `క‌ళ్యాణం క‌మ‌నీయం` సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది.  శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి  సంగీతం అందించారు. ఇప్ప‌టికే మూవీ నుంచి థీమ్ బేస్డ్ పాటలు ఓ మానస ..అయ్యో ఏంటో..హో ఎగిరే.. విడుద‌లై ఆక‌ట్టుకున్నాయి. తాజాగా పెళ్లిపై పాట ఆక‌ట్టుకుంది. ఈ పాట‌లో సంతోష్ డ్యాన్సులు అభిన‌యం పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేసింది.  కృష్ణకాంత్ సాహిత్యం ఎంతో క్యాచీగా ఆక‌ట్టుకుంది. యష్ కొరియోగ్రఫీ అందించారు. అనిల్ కుమార్ ఆళ్ల ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ పాట థీమ్ అందాన్ని మరింత పెంచింది. ఈ ప్రోమో సాంగ్ ఈరోజు ప్రభాస్ చేతుల మీదుగా విడుదలైంది.  శివ అనే ఉద్యోగం లేని భర్త అతని వ‌ర్కింగ్ వైఫ్‌ శ్రుతి (ప్రియా భవానీ శంకర్) చుట్టూ చక్కటి సంఘర్షణ నేప‌థ్యంలో ఈ సినిమా క‌థాంశాన్ని అల్లారు. ఈ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న‌ థియేటర్లలో విడుదలవుతోంది. యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    

Similar News