`హలో` చిత్రంతో తెలుగు వారికి పరిచయం అయ్యింది మలయాళీ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్. జున్ను అనే నేటితరం అమ్మాయిగా చక్కని నటన కనబరిచింది. నటించిన తొలి సినిమాతోనే తనదైన మార్క్ చూపించిన ఈ చిన్నది ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీ బిజీగా ఉంది. ఓవైపు తెలుగు - మరోవైపు తమిళం - మలయాళంలో నటించేస్తోంది. మెగా హీరో సాయి తేజ్ సరసన `చిత్రలహరి` చిత్రంలో నటించింది. ఈ నెల 12న సినిమా రిలీజవుతోంది. తదుపరి శర్వానంద్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. ఆ సినిమా త్వరలోనే రిలీజ్ కి రానుంది. తమిళంలో వాన్ - మానాడు అనే చిత్రాల్లో నటిస్తోంది. మలయాళంలో డాడ్ ప్రియదర్శన్ రూపొందిస్తున్న భారీ హిస్టారికల్ చిత్రం మరక్కార్ లో అతిధి పాత్రలో నటిస్తోంది.
`చిత్రలహరి`లో ఎలాంటి పాత్రలో నటిస్తోంది? అంటే.. లహరి అనే క్యూట్ చబ్బీ గాళ్ పాత్రలో కళ్యాణి ప్రయదర్శన్ మరోసారి తనదైన మ్యాజిక్ చేయబోతోందిట. ఈ చిత్రంలో అమాయకురాలిగా కనిపిస్తానని.. పక్కవాడు అబద్ధాలు చెప్పినా కనిపెట్టలేనంత ఇన్నోసెంట్ గా ఉంటానని తెలిపింది. చిత్రలహరిలో అవకాశం ఎలా దక్కింది? అని ప్రశ్నిస్తే.. హెలో చిత్రంలో నా నటన చూశాక .. చిత్రలహరిలో లహరి పాత్రలో నన్ను దర్శకుడు కిషోర్ ఊహించుకున్నారట. అతడు చెప్పిన కథ విన్న తర్వాత వెంటనే దాంతో ప్రేమలో పడ్డాను. అలా చిత్రలహరికి కమిటయ్యాను.. అని తెలిపింది. లహరి పాత్ర స్వభావం గురించి చెబుతూ.. చిన్నప్పటి నుంచి పాజిటివిటీ ఉన్న అమ్మాయి. తనకు అసలు ఈవిల్ అంటే ఏంటో తెలీనే తెలీదు. అంతేకాదు ప్రతి ఒక్కరినీ సులువుగా నమ్మేస్తుంది. ఎవరైనా అబద్ధాలు చెప్పి మోసం చేస్తారు అన్నదే ఊహించనంత అమాయకురాలు!! అంటూ డీటెయిలింగ్ ఇచ్చింది.
రియల్ లైఫ్ లోనూ అమాయకురాలేనా? అని ప్రశ్నిస్తే.. లహరి లానే నిజజీవితంలోనూ పాజిటివిటీ ఉన్న అమ్మాయినే. పైగా చుట్టూ ఉన్న వారితో ఎంతో క్లోజ్ గా ఉంటాను. వారి ప్రభావానికి ఇట్టే గురవుతాను. నీ తల కురులు ఏమంత బాలేదు అని నాన్నగారు చెబితే వెంటనే దానికి స్పందించి మార్పులు చేసేందుకు ప్రయత్నిస్తాను. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టి నటి అయిపోతానని అనుకున్నారా? అంటే .. సెట్స్ వాతావరణంలోనే పెరిగాను. నాన్నగారితో కలిసి రెగ్యులర్ గా సెట్స్ కి వెళుతూ ఉండేదానిని. అయితే నేను నటిని అవుతానని నాకు `హలో` కాల్ వచ్చే వరకూ తెలీదు. అనుకోకుండా నటిని అయ్యాను. తెరవెనక సినిమాని పరిశీలించిన అనుభవం ఉంది.. అమెరికాలో స్టేజీ డ్రామాకు సంబంధించిన కంపెనీలో ఉద్యోగం చేశాను కాబట్టి అన్నీ కలిసొచ్చాయని అనుకుంటాను.. అని తెలిపింది క్యూటీ.