కమల్ హాసన్, మణిరత్నం.. క్రేజీ అప్డేట్

Update: 2023-01-18 13:58 GMT
లోక నాయకుడు అనే బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకొని సౌత్ ఇండియాలోనే కాకుండా దేశంలోనే అత్యుత్తమ నటులలో ఒకరిగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ను కమల్ హాసన్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ విభిన్న కథలు, పాత్రలతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఉత్తమ కథానాయకుడు అనే ఇమేజ్ ని కమల్ హాసన్ సొంతం చేసుకున్నారు. పాత్ర కోసం ఎలాంటి కష్టమైనా భరించే తత్వం, ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసే నైపుణ్యం ఉన్న అతి కొద్ది మంది నటులలో కమల్ హాసన్ ఒకరిని చెప్పాలి.

గత ఏడాది లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ మూవీతో కమలహాసన్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు కమల్ హాసన్ రేంజ్ ని మరోసారి పాన్ ఇండియా వైట్ గా పరిచయం చేసింది. సరైన కథపడితే తనని బీట్ చేసే వారు ఎవరు ఉండరని ఈ సినిమాతో కమల్ హాసన్ ప్రూవ్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు కమల్ హాసన్ మరోసారి సౌత్ ఇండియన్ స్టార్ దర్శకుడు మణిరత్నంతో జతకట్టబోతున్నారు. కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్లో చివరిగా 1987లో నాయకుడు అనే సినిమా వచ్చింది.

ఈ సినిమా సెన్సేషనల్ హిట్ కావడంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో సంచలన రికార్డులు క్రియేట్ చేసింది. మరల 35 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కాంబినేషన్ రిపీట్ అవుతుంది. ఈ సినిమా కమల్ హాసన్ 234వ చిత్రం కావడం విశేషం. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ అప్డేట్ సౌత్ ఫిలిం సర్కిల్ లో వైరల్ అవుతుంది. ఫ్యాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ఇండియా మొత్తం అన్ని భాషలకు సంబంధించిన ఎనిమిది మంది స్టార్స్ ను మణిరత్నం ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తుంది.

బాలీవుడ్ నుంచి షారుక్ ఖాన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక కమల్ మణిరత్నం కాంబోలో ఈ సినిమాలో అన్ని ఇండస్ట్రీలలో ఫేమ్ ఉన్న స్టార్స్ ని తీసుకోబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం. ఇదే నిజమైతే ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా ఈ సినిమా మారుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News