సెలబ్రిటీల ఇళ్లపై ఐటీ దాడులు సర్వసాధారణం. అప్పట్లో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ ఇంటి పై, ఆర్.ఆర్.మూవీమేకర్స్ పై ఐటీ శాఖ దాడులు అంటూ హెడ్ లైన్స్ వచ్చినప్పుడు జనాలంతా నోళ్లు నొక్కుకుని మరీ తెగ మాట్లాడేసుకున్నారు. ఇటీవలే మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఇంటిపై ఐటీ అధికారులు దాడి చేసి బ్లాక్ మనీ పట్టుకున్నారన్న వార్త మాలీవుడ్ ని కుదిపేసింది. ఇలా ఎప్పటికప్పుడు హీరోలు, దర్శకనిర్మాతలు, నటీనటుల ఇళ్లపై దాడులు జరుగుతూనే ఉంటాయి. బోలెడన్ని నిజాలు తెలుస్తూనే ఉంటాయి.
మరి స్టార్లంతా నిజాయితీగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించడం లేదా? కోట్లలో ఆదాయం దండుకుంటూ ఎక్కడ దాచుకుంటున్నారు? అన్న ప్రశ్న తలెత్తింది. అయితే ఇలా పన్నులు చెల్లించడంలో నిజాయితీగా ఉండే స్టార్లు కూడా ఉన్నారు. అందులో ఓ ఇద్దరు సౌత్ స్టార్స్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. విలక్షణ నటుడు కమల్ హాసన్ ఈ విషయంలో ఎంతో నిజాయితీని, నిబద్ధతను చూపిస్తుంటారని చెబుతుంటారు. ప్రతియేటా ఇన్ టైమ్ లో పన్నులు చెల్లిస్తుంటారు. ఇప్పుడు ఆయన వారసురాలిగా శ్రుతిహాసన్ కూడా ప్రభుత్వాల్ని మోసం చేయకుండా రెగ్యులర్ గా ఆన్ టైమ్ పన్నులు చెల్లించేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. సెలబ్రిటీలందరికీ వీళ్లు ఆదర్శం ఈ విషయంలో.
అయితే ఇలా పన్నులు చెల్లిస్తున్న మాట నిజమే కానీ, అసలు తండ్రి కూతుళ్లిద్దరూ ఎంత సంపాదిస్తున్నారు అన్నదానికి మాత్రం లెక్క చెప్పడం లేదుట. ఇలా అయితే ఎలా?