భారీ వర్షాలు - వరదలతో కేరళ రాష్ట్రం అతలాకుతలమవుతోన్న సంగతి తెలిసిందే. వేల కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసం కావడం - పలు ఇళ్లు నీట మునగడం వల్ల ఇప్పటి వరకు 186 మంది మరణించారు. ప్రస్తుతం కేరళలో జనజీవనం స్తంభించిన సంగతి తెలిసిందే. అక్కడ వేలాది మంది ప్రజలు నిరాశ్రయులవ్వగా...మరెంతో మంది తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే కేరళ వరద బాధితుల సహాయార్థం దక్షిణాది సినీ హీరోలు నడుం బిగించారు. తాజాగా, విలక్షణ నటుడు కమల్ హాసన్ కూడా కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షలు విరాళం అందించారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ విషయాన్ని స్వయంగా తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.
కమల్ హాసన్ తమ పరిస్థితిని అర్థం చేసుకొని రూ.25 లక్షలు సహాయ నిధికి విరాళం ఇచ్చారని విజయన్ అన్నారు. దాంతోపాటు, విజయ్ టీవీ కూడా రూ.25 లక్షలు విరాళం ఇచ్చిందని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. కేరళ వరదబాధితుల సహాయార్థం ‘కేరళ రెస్క్యూ’ పేరుతో తమిళ హీరో విశాల్ విరాళాలు - వస్తువులు సేకరించారు. దాంతోపాటు, కేరళ వరద బాధితులను ఆదుకోవాలని సీఎం పినరయి విజయన్ పిలుపునిచ్చారు. దానికి స్పందించిన కోలీవుడ్ హీరోలు సూర్య - కార్తీ బ్రదర్స్ 25లక్షల విరాళాన్ని ఇచ్చారు. తనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాలీవుడ్ హీరో బన్నీ కూడా 25 లక్షలు ప్రకటించాడు. దాంతోపాటు, విజయ్ దేవరకొండ కూడా 5లక్షలు డొనేట్ చేశాడు. ది అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) ..10లక్షలు డొనేట్ చేసింది.