చాలా సంవత్సరాల తర్వాత ఓ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకున్న ఆనందంలో యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ ఉన్నాడు. విక్రమ్ సినిమా తో కమల్ హాసన్ ఏకంగా ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్నాడు.
బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కించుకున్న విక్రమ్ స్టార్ ఆనందంకు అవధులు లేకుండా ఉన్నాయి. ఇప్పటికే ఆనందంతో కమల్ బహుమానాలు ఇస్తూ సన్నిహితులను.. యూనిట్ సభ్యులను సంతోష పర్చుతున్నాడు.
విక్రమ్ సినిమా సక్సెస్ జోష్ నుండి బయటకు రాకుండానే మరో అరుదైన గౌరవం యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ కు దక్కింది. ఈమద్య కాలంలో యూఏఈ ప్రభుత్వం అత్యంత ప్రముఖులకు మరియు సేవా కార్యక్రమాలు నిర్వహించే వారికి బిజినెస్ మెన్స్ కు గోల్డెన్ వీసా ను ఇస్తున్న విషయం తెల్సిందే. ఈ గోల్డెన్ వీసాతో యూఏఈ లో అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
పదేళ్ల పాటు అక్కడి పౌరసత్వం వస్తుంది. అంతే కాకుండా అక్కడ వ్యాపారాలకు మరియు ఇతర పనులకు పలు వెసులుబాట్లు ఉంటాయి. అందుకే యూఏఈ గోల్డెన్ వీసా కోసం తీవ్రమైన పోటీ ప్రపంచ దేశాల సెలబ్రిటీల నుండి ఉంది అనేది టాక్. అలాంటి అరుదైన గౌరవం.. అత్యంత ప్రభావితం అయిన గోల్డెన్ వీసా ను కమల్ కు ఇవ్వబోతున్నట్లుగా యూఏఈ ప్రభుత్వం ప్రకటించింది.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్.. మలయాళ మెగా స్టార్ మమ్ముట్టీ లతో పాటు ఇంకా షారుఖ్ ఖాన్.. ఉపాసన.. ఇంకా బాలీవుడ్ కు చెందిన కొందరు ప్రముఖులకు కూడా ఈ అరుదైన గోల్డెన్ వీసా దక్కిన విషయం తెల్సిందే. సౌత్ స్టార్ హీరోల్లో ఒక్కరైన కమల్ హాసన్ కు ఈ గౌరవం దక్కడం తో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
విక్రమ్ సినిమా తో సూపర్ హ్యాపీగా ఉన్న సమయంలోనే ఈ గోల్డెన్ వీసా రావడం తో కమల్ తో పాటు ఆయన అభిమానులు కూడా చాలా సంతోషంగా ఉన్నారని తెలుస్తోంది. మొత్తానికి సౌత్ కు చెందిన అతి తక్కువ మందికి గోల్డెన్ వీసా దక్కగా.. ఆ జాబితాలో కమల్ హాసన్ ఉండటం నిజంగా గొప్ప విషయం.