ఈ మధ్య పెద్ద పెద్ద సెలబ్రెటీలందరూ వరుసగా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ - రజినీకాంత్ లాంటి రిజర్వ్డ్ పర్సనాలిటీస్ కూడా ట్విట్టర్లోకి అడుగుపెట్టేసి అభిమానులకు సందేశాలిచ్చేస్తున్నారు. ఈ కోవలోనే ఇప్పుడు లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ట్విట్టర్ లో అడుగుపెట్టేశాడు. తమిళ - తెలుగు భాషల్లో విపరీతమైన ఫాలోయింగ్ తో పాటు రెస్పెక్ట్ కూడా ఉన్న కమల్ ట్విట్టర్ లోకి అడుగుపెట్టడంతో అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కమల్ ట్విట్టర్ లోకి వచ్చాడు.
మంచి గాయకుడైన కమల్ హాసన్ తనదైన శైలిలో జనగణమన గీతాన్ని ఆలపించి ఆ వీడియోతో ట్విటర్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. భారత స్వతంత్ర పోరాటం ఇప్పటికీ యునీక్ అని.. ప్రపంచానికి ఇది సరికొత్త ప్రమాణాల్ని నిర్దేశించిందని కమల్ వ్యాఖ్యానించాడు. కమల్ నిన్న సాయంత్రం ట్విట్టర్ లోకి రాగా.. ఒక్క రోజులో 50 వేలమంది దాకా కమల్ ఫాలోయర్లుగా మారారు. ఇటీవలే ‘చీకటి రాజ్యం’ సినిమాతో పలకరించిన కమల్ ప్రస్తుతం తన మిత్రుడు, ప్రముఖ మలయాళ దర్శకుడు రాజీవ్ కుమార్ దర్శకత్వంలో అమల కథానాయికగా ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమా ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకొస్తుంది.