మరుదనాయగం.. కమల్ హాసన్ కలల సినిమా. బాలీవుడ్ లో సైతం 50 కోట్లతో ఓ సినిమా తీయడానికి భయపడే పరిస్థితుల్లో దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తీయడానికి ఏర్పాట్లు చేశాడు కమల్. 90ల చివర్లో ఎలిజబెత్ రాణిని రప్పించి.. అంగరంగ వైభవంగా ఈ చిత్ర ప్రారంభోత్సవం కూడా చేశాడు. ఆ తర్వాత షూటింగ్ మొదలుపెట్టి కొన్ని అద్భుత సన్నివేశాలు కూడా తెరకెక్కించాడు. కానీ బడ్జెట్ సమస్యలతో ఈ సినిమా అటకెక్కింది. అప్పట్నుంచి దశాబ్దంన్నరగా ఈ సినిమాను పున:ప్రారంభించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు కమల్. కానీ ఆయన ప్రయత్నాలు ఫలించడం లేదు.
తన సినిమాల ప్రమోషన్ల సమయంలో ప్రతిసారీ విలేకరుల నుంచి ‘మరుదనాయగం’ సినిమాకు సంబంధించిన ప్రశ్న వస్తుంది. ఆయన తన ప్రయత్నాల గురించి చెబుతారు. ఐతే ఎట్టకేలకు కమల్ కలల సినిమాను పూర్తి చేయడానికి ఆయన మిత్రుడే ఒకరు ముందుకొచ్చినట్లు సమాచారం. లండన్లో ఉండే పెద్ద వ్యాపారి అయిన ఆ మిత్రుడు.. ప్రస్తుతం ‘రోబో-2’ చేస్తున్న లైకా ప్రొడక్షన్స్ తో కలిసి ‘మరుదనాయగం’ సినిమాను మళ్లీ మొదలుపెట్టి పూర్తిచేయడానికి సంకల్పించాడట. కాబట్టి ఈ ఏడాదే ‘మరుదనాయగం’ తిరిగి పట్టాలెక్కే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కమల్ త్వరలోనే దీనికి సంబంధించి ప్రకటన చేయబోతున్నాడట.