శ్రుతి హాసన్ కెరీర్ ఆరంభం నుంచి ఆమెను జనాలు ఓ ప్రశ్న అడుగుతూనే ఉన్నారు? నాన్నతో కలిసి ఎప్పుడు నటిస్తావు అని. అవకాశం రావాలి కానీ.. అంత కంటే అదృష్టమా అంటోంది శ్రుతి. ఐతే ఇప్పుడా అవకాశం వచ్చినట్లే ఉంది. కమల్ - శ్రుతి త్వరలోనే తెరను పంచుకోబోతున్నారు. తన మిత్రుడు - ప్రముఖ మలయాళ దర్శకుడు రాజీవ్ కుమార్ దర్శకత్వంలో కమల్ నటిస్తున్న సినిమాలో శ్రుతి కూడా కనిపించే అవకాశాలున్నాయట. ఇందులో వాళ్లిద్దరూ తల్లీ కూతుళ్లుగా నటించబోతున్నట్లు యూనిట్ సభ్యుడొకరు వెల్లడించారు.
‘‘శ్రుతిని ఈ సినిమాలో నటింపజేయాలన్నది రాజీవ్ ఆలోచనే. కమల్ ముందు సంశయించినా తర్వాత ఒప్పుకున్నారు’’ అని అతను చెప్పాడు. కమల్ - శ్రుతి కలిసి మరో సినిమాలో కూడా నటించే అవకాశాలున్నాయట. కమల్ తో కలిసి నటించకపోయినా ఆయన సినిమాలకు పని చేసింది శ్రుతి. ‘ఈనాడు’ సినిమా కోసం ఆమె స్వయంగా ఓ ప్రమోషనల్ సాంగ్ కంపోజ్ చేసి.. అందులో కనిపించింది కూడా. ఈ మధ్య వాళ్లిద్దరూ కలిసి ఓ వేదికపై డ్యాన్సులేని అభిమానుల్ని ఉర్రూతలూగించారు. ఇక ఇద్దరూ తెరమీద కలిసి కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం తెలుగులో నాగచైతన్య సరసన ‘మజ్ను’లో నటిస్తున్న శ్రుతి.. తమిళ - హిందీ భాషల్లో భారీ చిత్రాల్లో కనిపిస్తోంది. ఇక కమల్ చేస్తున్న కొత్త సినిమాలో అమల కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.