పెటాపై విరుచుకుపడిన లోకనాయకుడు

Update: 2017-01-23 14:06 GMT
జల్లికట్టు నిషేదం మీద విధించిన నిషేదంపై తమిళులు ఈ రోజు ఇంతలావిరుచుకుపడుతున్నారు కానీ.. తొట్టతొలుత ఓరేంజ్లో విరుచుకుపడిన ఘనతలోకనాయకుడికి ప్రసిద్ధి పొందిన కమల్ హాసన్ కే చెల్లుతుంది.జల్లికట్టులో ఎద్దుల్నిహింసిస్తున్నారన్న వాదన్ను తీవ్రంగా ఖండించటమే కాదు.. అలా అనే వారు చికెన్బిర్యానీని కూడా నిషేధించాలని డిమాండ్ చేయాలని కోరటం తెలిసిందే.

తాజాగా జల్లికట్టు రచ్చకు అసలుకారణమైన పెటాపై ఆయన తీవ్ర స్థాయిలోమండిపడ్డారు. భారతీయ ఎద్దుల్ని అణిచివేసే అర్హత పెటాకు లేదన్న కమల్ హాసన్.. ఆ సంస్థకు ఒక సూచన చేశారు. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికాలో నిర్వహించే బుల్ రైడింగ్ రోడియోస్ ను నిషేధించే అంశంపై కృషి చేయాలనన్నారు. ప్రజలకు ప్రజాస్వామ్యమంటే ఏమిటో తెలుస్తోందని.. వినయంతో కూడి మార్గ అన్వేషకులు.. సామాజిక సంస్కరణవేత్తలు మనకిప్పుడు అవసరంగా కమల్ హాసన్ పేర్కొన్నారు. పెటాపై కమల్ హాసన్ తో పాటు.. ఇప్పటికేతమిళ సినిమా హీరోలు సూర్య.. విజయ్ తదితరులు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News