`2.ఓ` సక్సెస్ శంకర్ కి బిగ్ బూస్ట్ అనే చెప్పాలి. ఈ విజయం `భారతీయుడు 2` కిక్ స్టార్ట్‌కి పెద్ద సాయమవుతోందనే చెప్పాలి. ఇప్పటికే కథ రెడీ చేసిన శంకర్ ఈ సినిమా లొకేషన్ల కోసం చాలా సీరియస్ గానే కసరత్తు చేశాడు. ఇండియా సహా ఉక్రెయిన్ - తైవాన్ లో ఎగ్జోటిక్ లొకేషన్లను శంకర్ బృందం ఫైనల్ చేశారట. హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీ - చెన్నయ్ - పొలాచ్చి లాంటి చోట్ల కీలకంగా షూటింగ్ జరగనుంది.
అయితే ఈ పాటికే రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కావాల్సి ఉన్నా - రకరకాల కారణాలతో ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఓవైపు విశ్వనటుడు కమల్ హాసన్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండడంతో ప్రాజెక్టు డిలే అయ్యింది. అయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని శంకర్ భావిస్తున్నారట. ఆల్మోస్ట్ స్క్రిప్టు, లొకేషన్స్ పరంగా క్లారిటీ వచ్చేసింది. అనిరుధ్ సంగీత దర్శకుడిగా ఇప్పటికే బాణీల కసరత్తులో ఉన్నాడు. కథానాయికగా చందమామ కాజల్ ని ఫైనల్ చేసేశారు. ఇతర పాత్రలకు ఎంపికలు సాగుతున్నాయి. ఆ క్రమంలోనే హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో వేసిన భారీ సెట్స్ లో ఈ నెలాఖరు నుంచి షూటింగ్ ప్రారంభించాలని భావిస్తున్నారట.
2.ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రతిష్ఠాత్మక లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని కూడా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. ఇక భారతీయుడు కథతో పోలిక లేని, కొత్త కథతో ఈ సినిమాని శంకర్ తెరకెక్కించనున్నారు. లంచగొండితనం, అవినీతి కామన్ బ్యాక్ డ్రాప్ అయినా ఇప్పటి రాజకీయాలు - సామాజిక పరిస్థితులకనుగుణంగానే కథను మలిచారని తెలుస్తోంది. ముఖ్యంగా రాజకీయ అవినీతిపై భారతీయుడి యుద్ధం భీకరంగా ఉంటుందన్న లీకులు అందాయి. దేశ రాజకీయాలు సహా, తమిళనాడు అస్థిర రాజకీయాల నేపథ్యం - అలాగే భారీ స్కామ్ లు వగైరా వాటిని భారతీయుడు-2 చిత్రంలో కమల్ హాసన్ ప్రశ్నించనున్నారు. భారతీయుడు 2 చిత్రాన్ని వేగంగా పూర్తి చేసి, అటుపై రాజకీయాలపైనా కమల్ హాసన్ పూర్తిగా దృష్టి సారించనున్నారు.
Full View