గ్లోబలైజేషన్ నేపథ్యంలో ప్రపంచం ఓ విలేజ్ గా మారింది. ఈ ప్రపంచంలో ఎవరు.. ఎప్పుడు .. ఏదైనా అమ్మేయొచ్చు. అందుకే దేశంలో చైనా ఉత్పత్తులు, విదేశీ వస్తూత్పత్తులు వెల్లువలా వచ్చి పడ్డాయి. పెద్ద పెద్ద కార్పొరెట్ దిగ్గజాలు దేశం మీద పడి మన సొమ్ముల్ని విదేశాలకు ఎగరేసుకుపోతున్నాయి. తెలివైన విదేశీ కార్పొరెట్ కంపెనీలు తమ ఉత్పత్తుల్ని లోకల్ సెలబ్రిటీల చేత ప్రమోషన్ చేయించుకుని వాటి అమ్మకాలు సాగిస్తున్నాయి.
అయితే కొందరు స్టార్లు ఉత్పత్తిలో విషయం ఎంత? నాణ్యత ఎంత? అనేది కూడా చూడకుండా ప్రజల నమ్మకాన్ని పణంగా పెట్టి డబ్బు కోసం ఏ పనికైనా రెడీ అవుతున్నారు. వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇలా అందరూ చేయరు. ముఖ్యంగా కమల్ హాసన్ లాంటి విలక్షణుడు. అయితే ఇవేవీ నచ్చకపోవడం వల్లే విలక్షణ నటుడు కమల్ హాసన్ కొన్ని దశాబ్ధాల క్రితం ఓ కఠోరమైన నిర్ణయాన్ని తీసుకున్నాడా? అన్న సందేహం వస్తుంది. ఎనిమిది దశాబ్ధాల చిత్రపరిశ్రమలో ఐదు దశాబ్ధాలుగా కమల్ హాసన్ అనే విలక్షణ నటుడిగా తన హవా సాగిస్తూనే ఉన్నాడు. నటనలో, దర్శకత్వంలో దూకుడు సాగిస్తూనే ఉన్నాడు. అతడు నేషనల్ - ఇంటర్ నేషనల్ ఫిగర్. అందుకే ఇన్నేళ్లలో ఎన్నో కంపెనీలు తనని వాణిజ్యప్రకటనల్లో నటించాల్సిందిగా కోరాయి. కోట్లాది రూపాయల్ని ఆఫర్ చేశాయి. కానీ అందుకు ససేమిరా అన్నాడు.
కానీ కాలంతో పాటే మార్పు అంటారు. ఇప్పుడు కమల్ కూడా మారాడు. ఓ కార్పొరెట్ కంపెనీకి ప్రమోషన్ చేసేందుకు ముందుకొచ్చాడు. చెన్నయ్ కి చెందిన వస్ర్త వ్యాపార దుకాణాన్ని ప్రమోట్ చేసేందుకు రెడీ అయ్యాడు. అయితే కమల్ ఉన్నట్టుండి ఇలా నిర్ణయం మార్చుకోవడానికి కారణం ఏమై ఉంటుంది? ఇప్పటికీ మిస్టరీనే. ఉన్నట్టుండి ఈ మార్పు.. ఎన్నో సందేహాలకు తావిచ్చింది. దీనికి కమల్ ఓపెన్ సమాధానం ఏంటో? ఈ విశ్వనటుడు ప్రస్తుతం చీకటి రాజ్యం షూటింగులో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.