కమల్ హాసన్ కేవలం నటుడే కాదు.. దర్శకుడు కూడా. అది కూడా ఆషామాషీ డైరెక్టర్ కాదు. హేరామ్ - విశ్వరూపం లాంటి అంతర్జాతీయ స్థాయి సినిమాలు చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. వీటితో పాటు గుణ - సత్యమే శివం - దశావతారం - ఉత్తమవిలన్ - చీకటి రాజ్యం లాంటి సినిమాలకు ఘోస్ట్ డైరెక్షన్ చేశాడన్న అభిప్రాయం కూడా ఉంది జనాల్లో. ఈ సినిమాలన్నింటికీ స్క్రీన్ ప్లే కూడా ఆయనదే అన్న సంగతి తెలిసిందే. ఐతే ఎప్పుడూ తాను నటించే సినిమాలకు స్క్రిప్టు రాయడం - దర్శకత్వం చేయడమేనా.. వేరే హీరోలతో కూడా సినిమా చేయొచ్చుగా అని కమల్ ను అడిగితే ఆసక్తికరమైన సమాధానం చెప్పారు కమల్.
తన మిత్రుడు మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయాలని ఒకప్పుడు అనుకున్నానని.. ఆ సంగతి చిరంజీవికి కూడా చెప్పానని.. ఐతే అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదని కమల్ చెప్పాడు.‘‘వేరే నటులతో నేను సినిమాలు ఎందుకు తీయలేదని అడుగుతుంటారు. కానీ నేను హీరోగా తీసే సినిమాల్లో వేరే నటుల్ని డైరెక్ట్ చేస్తున్నా కదా. వేరే హీరోలతో సినిమాలు తీయాలని నాకూ ఉంది. పాతికేళ్ల క్రితమే చిరంజీవిని డైరెక్ట్ చేస్తానని చెప్పా. అందులో నేను నటించనని.. కేవలం దర్శకత్వమే చేస్తానని అన్నాను. ఆ మాట సీరియస్ గానే చెప్పాను. కానీ అనుకోని కారణాలతో ఆ సినిమా పట్టాలెక్కలేదు’’ అని చెప్పాడు లోకనాయకుడు. కమల్ దర్శకత్వం వహించిన‘విశ్వరూపం-2’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.