ఆయన లేకుంటే చేసేది ఎవరు? చూసేది ఎవరు?

Update: 2022-02-21 03:21 GMT
ఉత్తరాదిన బిగ్‌ బాస్ సూపర్‌ హిట్‌ అయ్యింది. సుదీర్ఘ కాలంగా హిందీ బిగ్ బాస్ కొనసాగుతూ వస్తుంది. సౌత్‌ లో కూడా బిగ్‌ బాస్ కు ఆధరణ లభిస్తుందనే ఉద్దేశ్యంతో తెలుగు మరియు తమిళంలో ఒకేసారి బిగ్‌ బాస్ షో ను ప్రారంభించారు. రెండు భాషల్లో ఇప్పటి వరకు అయిదు సీజన్ లు పూర్తి అయ్యాయి. తెలుగు మొదటి సీజన్ కు ఎన్టీఆర్‌ రెండవ సీజన్ కు నాని హోస్టింగ్‌ చేయగా మిగిలిన మూడు సీజన్‌ లకు నాగార్జున హోస్టింగ్‌ చేశాడు.

తమిళ బిగ్ బాస్ మొత్తం అయిదు సీజన్ లకు కూడా కమల్‌ హాసన్ హోస్టింగ్‌ చేశాడు. బిగ్‌ బాస్‌ అంటే తన మనసుకు దగ్గర అయిన షో కనుక ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా కొనసాగిస్తూ వచ్చాను అన్నట్లుగా కమల్‌ హాసన్‌ గతంలో చెప్పుకొచ్చాడు. తాజాగా తెలుగు బిగ్‌ బాస్ ఓటీటీ తరహాలోనే తమిళ బిగ్‌ బాస్ అల్టిమేట్‌ ను డిజిటల్ ప్లాట్‌ ఫామ్‌ ద్వారా తీసుకు వచ్చేందుకు సిద్దం అయిన విషయం తెల్సిందే.

ఇటీవలే ఆ షో కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. తెలుగు బిగ్ బాస్ ఓటీటీకి నాగార్జున హోస్టింగ్‌ చేయబోతున్నాడు. ఇక తమిళ బిగ్‌ బాస్ అల్టిమేట్‌ కు కమల్‌ హాసన్‌ హోస్టింగ్‌ చేయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. ఆయన హోస్ట్‌ గా పబ్లిసిటీ కూడా మొదలు అయ్యింది. కాని అనూహ్యంగా షో నుండి తప్పకుంటున్నట్లుగా యూనివర్శిల్‌ స్టార్ కమల్ హాసన్‌ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

విక్రమ్‌ సినిమా కారణంగా బిగ్‌ బాస్ అల్టిమేట్‌ కు హోస్ట్‌ గా వ్యవహరించలేక పోతున్నట్లుగా కమల్‌ పేర్కొన్నాడు. షో నిర్వాహకులతో చర్చలు జరిపిన తర్వత ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు. కరోనా వల్ల విక్రమ్ సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు ఆలస్యం అయ్యాయి. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ మరియు బిగ్‌ బాస్ షో డేట్లు క్లాష్ అవుతున్నాయి. అందుకే బిగ్‌ బాస్ ను చేయలేక పోతున్నట్లుగా అభిమానులకు మరియు బిగ్‌ బాస్‌ ప్రేక్షకులకు క్లారిటీ ఇచ్చి మరీ తప్పుకున్నాడు.

కమల్‌ హాసన్‌ లేని బిగ్‌ బాస్ ను తమిళ ఆడియన్స్ ఊహించుకోలేక పోతున్నారు. తమిళ ప్రేక్షకులకు బిగ్‌ బాస్ అంటే కమల్‌ హాసన్‌ అన్నంతగా మైండ్‌ లో ఫిక్స్ అయ్యింది. వరుసగా అయిదు సీజన్ లు చేసిన ఆయన తప్పుకుని మరెవ్వరో వస్తే చేస్తే.. షో ను ఎవరు చూస్తారు అంటూ చర్చ జరుగుతోంది. కమల్‌ స్థాయి హోస్ట్‌ ను షో నిర్వాహకులు తీసుకు రావడం అసాధ్యం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బిగ్ బాస్ ఓటీటీ మరియు బిగ్‌ బాస్ రెగ్యులర్ రెండు ఫార్మట్‌ లకు కూడా కమల్‌ హాసన్‌ తప్పుకున్నాడా అనే విషయమై క్లారిటీ లేదు. విక్రమ్‌ సినిమా కారణంగా అన్నాడు కనుక ఖచ్చితంగా బిగ్‌ బాస్ రెగ్యులర్‌ షో కు కమల్‌ హోస్టింగ్‌ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓటీటీ ఫార్మట్ కు పెద్దగా ప్రాముఖ్యత లేద.. హైప్‌ లేదు అందుకే షో నుండి కమల్‌ తప్పుకున్నా పెద్దగా ఇబ్బంది లేదు అనేది ఒక వర్గం ప్రేక్షకుల అభిప్రాయం. మొత్తానికి బిగ్‌ బాస్‌ తమిళ ప్రేక్షకులు కమల్‌ లేకుంటే అల్టిమేట్‌ షో ను ఆధరిస్తారా అనేది చూడాలి.


Tags:    

Similar News