ఇండియన్ సినీ చరిత్రలో తనదైన మార్కు సినిమాలతో లెజెండరీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు మణిరత్నం. గత కొన్నేళ్ల తన కలల ప్రాజెక్ట్ ని మొత్తానికి సాకారం చేసుకుంటూ తెరపైకి తీసుకొచ్చారు. అదే 'పొన్నియిన్ సెల్వన్'. ఈ భారీ పీరియాడిక్ ఎపిక్ డ్రామాని రెండు భాగాలుగా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్యారాయ్ కీలక పాత్రల్లో నటించారు.
భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీపై తాజాగా షాకింగ్ సీక్రెట్ ని బయటపెట్టారు కమల్ హాసన్. ఈ మూవీని 30 ఏళ్ల క్రితమే చేయాలని మణిరత్నం ప్లాన్ చేశారట. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోలుగా ఈ మూవీని తెరపైకి తీసుకురావాలనుకున్నారట. 1989లో స్క్రిప్ట్ ని పూర్తి చేసిన మణిరత్నం సెట్స్ పైకి తీసుకెళ్లలేకపోయారట. పలు కారణాల వల్ల అనుకున్న విధంగా ఈ మూవీ పట్టాలెక్కలేకపోవడంతో మణిరత్నం ఆ ప్రయత్నాలని విరమించుకున్నారట.
ఈ విషయాల్ని స్వయంగా కమల్ హాసన్ వెల్లడించడం విశేషం. అంతే కాకుండా ఈ సందర్భంగా 'పొన్నియిన్ సెల్వం' గురించి ఓ సీక్రెట్ ని కూడా బయటపెట్టారాయన. ఈ మూవీ ఆడియో, ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న కమల్ హాసన్ ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ 'ఈ సినిమా గురించి మణిరత్నం నాకు చెప్పారు. అందులో వంతియదేవన్ పాత్రలో రజనీ చేస్తే బాగుంటుందని నాకు శివాజీ గణేషన్ గారు అన్నారు. నేను ఆ పాత్ర చేయాలనుకుంటున్నానని చెప్పాను.
అయితే ఆయన మాత్రం అరుణ్ మోళి వర్మన్ పాత్ర చేయమని పట్టుబట్టారు. అలా ఆ పాత్ర కోసం రజనీతో పోటీపడ్డాను' అని కమల్ చెప్పుకొచ్చారు. ఇక రజనీ మాట్లాడుతూ 'ఎలాగైనా నేను ఈ సినిమాలో భాగం కావాలనుకుని 'పెరియ పజు వెట్టరైయార్ పాత్రలో నటిస్తానని చెప్పాను.
కానీ మణి సర్ మాత్రం ఆ పాత్రలో నటిస్తే అభిమానులు సంతోషించరని వద్దన్నారు. కొంత మంది అలాంటి ఆఫర్ ఇస్తే వెంటనే ఓకే చెబుతారు కానీ మణి సార్ మాత్రం అందుకు అంగీకరించలేదు అదే ఆయన ప్రత్యేకత అని రజనీ ప్రశంసలు కురిపించారు.
ఇదిలా వుంటే రజనీ తో కమల్ పోటీపడ్డ పాత్రలో ప్రస్తుతం కార్తి నటించారు. వందియదేవన్ గా ఆదిత్య కరికాళన్ కు సహయకుడిగా గూఢచారి, అత్యంత సాహసవంతుడిగా ఈ పాత్ర వుంటుందట. ఇక కమల్ ని శివాజీ గణేషన్ చేయమని చెప్పిన అరుణ్ మోళి వర్మన్ అంటే పొన్నియన్ సెల్వన్ పాత్రలో జయం రవి నటించడం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.