భారతీయ సినిమాకి పరిచయం అక్కర్లేని పేరు కమల్ హాసన్. ఎన్నో ఏళ్లుగా నటుడిగా ఆయన వేషాలు, రచయితగా, దర్శకుడిగా ఆయన శైలి మనకు సుపరిచితమే. రాజ్ కమల్ సంస్థలో సహాయ దర్శకుడిగా ఏడేళ్ళపాటు పనిచేసిన రాజేష్ ఎమ్ సెల్వ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ కమల్ నటుస్తున్న తాజా చిత్రం 'చీకటి రాజ్యం'. తెలుగు తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని తమిళంలో తూంగావనం పేరుతో తెరకెక్కించనున్నారు. విశ్వరూపం సినిమాకి దర్శకుడిగా కమల్ తో పనిచేసిన సానూ వర్ఘీస్ ఈ సినిమాకి నటుడిగా ఆయన్ని తన కెమెరాలో బంధిస్తున్నారు. కమల్ ఆస్థాన సంగీత దర్శకుడిగా మారిపోయిన జిబ్రాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలకి అధిక ప్రాముఖ్యత వున్నట్టు దర్శకుడు చెప్పాడు. అందుకోసం ఏకంగా ఫ్రెంచ్ ఫైట్ మాస్టర్స్ ని రంగలోకి దించాడు. తాజాగా చిత్రీకరించిన పోరాట సన్నివేశాల్లో కమల్ దూకుడు చూసి ఆ తెల్ల పోటుగాళ్ళు తెల్లబోయారట. ఈ వయసులో కమల్ అలా చేయడం ఎంతో అబ్బురపరిచిందని వారు చెప్పారు. పాపం వీరికి కమల్ గురించి అంతగా తెలియదు కదా.. అలాగే వుంటుంది మరి. ఈ విషయం కాస్త పక్కన పెడితే వీరికి హైదరాబాద్ ఆహరం తెగ నచ్చేసిందట. గ్యాప్ దొరికినప్పుడల్లా బ్రేవ్.. మనిపిస్తున్నారట.
అన్నట్టు మరో విషయం ఈ సినిమాకి ప్రోస్థటిక్ మేకప్ (విక్రమ్ ఐ సినిమాలో కనపడినట్టు) అవసరమట. ఆ నిపునిదేమో సమయానికి రాలేదు. ఆ పరిస్తుతుల్లో స్వయంగా కమలే రంగలోకి దిగి తోటి నటులైన ప్రకాష్ రాజ్ వంటి వారికి రంగులు అద్దారుట. కమల్ కు తెలియని సినిమా విద్య...?!!