రిటైర్మెంట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు కమల్ హాసన్..!

Update: 2022-11-07 06:08 GMT
లోక నాయకుడు కమల్ హాసన్ బర్త్ డే నేడు. 1954 నవంబర్ 7న జన్మించిన కమల్ హాసన్ నేడు 68వ బర్త్ డేను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ.. రాజకీయ ప్రముఖులు.. అభిమానులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా నేషనల్ వైడ్ గా ఆయన పేరు ట్రెండింగ్ అవుతోంది.

మూడేళ్ల వయసులోనే బాలనటుడిగా కమల్ హాసన్ వెండితెరకు పరిచయమయ్యాడు. తాను నటించిన మొదటి సినిమా 'కలాతూర్ కన్నమ్మ'కే బాలనటుడిగా  జాతీయ పురస్కారం అందుకున్నాడు. తన మొదటి సినిమాకే 2వేల పారితోషికం తీసుకున్నాడు. ఆ రోజుల్లో ఇది చాలా ఎక్కువని కమల్ హాసన్ ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఇక ఆ తర్వాత జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కమల్ హాసన్ మూడుసార్లు దక్కించుకున్నాడు.

బాలనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమల్ హాసన్ పెద్దయ్యాక నటన వైపు వెళ్లాలని అనుకోలేదు. క్లాసికల్ డాన్స్.. సంగీతం నేర్చుకున్న కమల్ హాసన్ ఆ తర్వాత డాన్స్ అసిస్టెంట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. టెక్నీషియన్ గా అక్కినేని నాగేశ్వర్ రావు నటించిన 'శ్రీమంతుడు' చిత్రానికి పని చేశాడు. స్నేహితుడు ఆర్సీ సత్యన్ ప్రోత్సాహంతో రైటింగ్ స్కిల్స్ మెరుగు పర్చుకున్నాడు. కొరియోగ్రాఫర్ గా.. రైటర్ గా కొనసాగుతూ మధ్య అసిస్టెంట్ డైరెక్టర్ కావాలని కమల్ భావించాడు.  

ప్రముఖ దర్శకుడు కే బాలచందర్ ఓ సినిమా తీయబోతున్నారని తెలిసి లొకేషన్ వెళ్లారు. కమల్ ను చూసిన బాలచందర్ తనకు అసిస్టెంట్ డైరెక్టర్ అవకాశం ఇవ్వకుండా నటుడిగా అవకాశం కల్పించినట్లు తెలిపారు. అలా వీరిద్దరి కాంబినేషన్ లో దాదాపు 35 సినిమాలు వచ్చాయి. '16 వయదినిలే'.. 'మరో చరిత్ర' వంటి సినిమాలు కమల్ హాసన్ కెరీర్ ను మలుపు తిప్పాయి.

కమల హాసన్ తనకు ఏ పాత్ర ఇచ్చి ఒదిగి పోతాడు. 'అపూర్వ సహాదరర్గల్' లో మరుగుజ్జుగా.. గుణ మూవీలో అమాయకుడిగా.. ఆకలి రాజయంలో నిరుద్యోగిగా నటించిన ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. 'స్వాతిముత్యం'.. 'సాగర సంగమం' వంటి క్లాసికల్ మూవీలోనూ.. 'నాయకుడు'.. 'భారతీయుడు'.. 'దశావతారం'.. 'విశ్వరూపం'..  'విక్రమ్' వంటి యాక్షన్ మూవీలోనూ కమల్ తనదైన ముద్ర వేశాడు.

క్లాస్.. మాస్ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తూ కమల్ హాసన్ అభిమానులను మెస్మరైజ్ చేస్తున్నారు. మరోవైపు డైరెక్టర్ గా.. సింగర్ గా.. డాన్సర్ గా.. నటుడిగా.. నిర్మాతగా కమల్ హాసన్ బహుముఖ ప్రజ్ఞశాలిగా నిలిచారు.  డైరెక్టర్ కమల్ హాసన్ తొలి సినిమా 'చాచీ 420'. ఆ తర్వాత 'హే రామ్'.. 'విరుమాండి'.. 'విశ్వరూపం' సినిమాలను తెరకెక్కించాడు.

కుర్ర హీరోలకు ధీటుగా ఈ వయస్సులోనూ కమల్ హాసన్ బాక్సాఫీస్ వద్ద రఫ్పాడిస్తున్నాడు. కమల్ తాజా చిత్రం 'విక్రమ్' ప్యాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్టుగా నిలిచింది. తన రిటైర్మెంట్ పై కమల్ తాజాగా స్పందిస్తూ తనకు యాక్టింగ్ అంటే ప్యాషన్ అని.. అందుకే ఇందులో కొనసాగుతున్నానని స్పష్టం చేశారు.ఇన్నేళ్ల తన సినీ ప్రయాణంలో ఇక చాలు అనే ఫీలింగ్ రాలేదని చెప్పారు. సినిమాను ప్రొఫెషన్ గా భావించలేదని.. అలా అనుకుంటే ఎప్పుడో రిటైర్మెంట్ అయ్యేవాడనని చెప్పాడు.

కమల్ హాసన్ ప్రస్తుతం 'ఇండియన్ 2'.. 'విక్రమ్' సిరీసులతో బీజీగా ఉన్నారు.  వీటితోపాటు మణిరత్నం దర్శకత్వంలో కమల్ ఓ సినిమా చేయబోతున్నాడు. కమల్ హసన్ కు ఇద్దరు కుమార్తెలు శృతి హాసన్.. అక్షర హాసన్ లు సైతం ఇండస్ట్రీలో కథానాయికలుగా రాణిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News