క‌మ‌ల్ కాన్ఫిడెన్స్ మామూలుగా లేదుగా

Update: 2022-05-27 01:30 GMT
యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ మ‌ళ్లీ రెట్టించిన విశ్వాసంతో స‌రికొత్త స్పీడుతో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నారు. దాదాపు నాలుగేళ్లు గా సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌చ్చిన క‌మ‌ల్ హాస‌న్ `విశ్వ‌రూపం 2` త‌రువాత మ‌రో సినిమా చేయ‌లేదు.

ఇన్నేళ్ల విరామం త‌రువాత ఆయ‌న న‌టించిన చిత్రం `విక్ర‌మ్‌`. ఖైదీ, మాస్ట‌ర్ వంటి సినిమాతో ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న యంగ్ డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. రాజ్ క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్ పై క‌మ‌ల్ హాస‌న్ స్వ‌యంగా న‌టిస్తూ ఈ మూవీని నిర్మించారు.

1986లో వ‌చ్చిన `విక్ర‌మ్` చిత్రానికి దీనికి లింక్ చేస్తూ అదే టైటిల్ తో చేసిన మూవీ కావ‌డంతో ఈ చిత్రాన్ని క‌మ‌ల్ అభిమానుల‌తో పాటు ఆయ‌న సినిమాలు ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కులు ప్ర‌త్యేకంగా చూస్తున్నారు. క‌మ‌ల్ హాస‌న్ రా ఏజెంట్ గా ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో న‌టించిన ఈ మూవీలోని కీలక పాత్ర‌లలో విజ‌య్ సేతుప‌తి, ఫహ‌ద్ ఫాజిల్ న‌టించారు. ఈ విష‌యం ప్ర‌క‌టించిన ద‌గ్గ‌రి నుంచే ఈ ప్రాజెక్ట్ హాట్ టాపిక్ గా మారింది. గ‌త కొంత కాలంగా ఫామ్ ని కోల్పోయిన క‌మ‌ల్ హాస‌న్ మ‌ళ్లీ ఈ మూవీతో త‌న పూర్వ వైభ‌వాన్ని సొంతం చేసుకుంటారంటూ అభిమానులు ఆశ‌గా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ మూవీపై క‌మ‌ల్ హాస‌న్ త‌న అభిమానుల త‌ర‌హాలో తాను కూడా మంచి కాన్ఫిడెన్స్ తో వున్నార‌ట‌. సినిమా అవుట్ పుట్ ని చూసుకున్న క‌మ‌ల్ రెట్టించి జోష్ తో మ‌ళ్లీ త‌న టైమ్ స్టార్ట్ కాబోతోంద‌నే త‌ర‌హాలో గ‌ట్టి న‌మ్మ‌కంతో వున్నార‌ట‌. అదే న‌మ్మ‌కంతో  `విక్ర‌మ్‌` సినిమాకు రెండు సీక్వెల్స్ చేయ‌బోతున్నాన‌ని ప్ర‌క‌టించ‌డం విశేషం.

ఇక ఈ రెండు సీక్వెల్స్ కు కూడా లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తాడ‌ని స్ప‌ష్టం చేశారు. జూన్ 3న `విక్ర‌మ్` పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ ప్ర‌చారాన్ని జోరుగా మొద‌లు పెట్టారు క‌మ‌ల్ హాస‌న్ ఇందులో భాగంగా చెన్నైలో ప్ర‌త్యేకంగా మీడిమ‌యాతో మాట్లాడిన క‌మ‌ల్ ఈ ప్రాజెక్ట్ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించడం ఆస‌క్తిక‌రంగా మారింది.

`విక్ర‌మ్‌`కు సీక్వెల్ ని ఖ‌రారు చేశామ‌ని, దీని త‌రువాత `విక్ర‌మ్ 3` కూడా వుంటుంద‌ని వెల్ల‌డించారు. భారీ అంచ‌నాలు పెట్టుకున్న ఈ మూవీని మ‌రింత మందికి చేరువ చేయాలనే ఆలోచ‌న‌తో ఈ మూవీ ప్ర‌చారాన్ని దుబాయ్‌, మ‌లేషియా, ముంబై, హైద‌రాబాద్ వ‌చ్చే వారం ప‌ర్య‌టించ‌బోతున్నామ‌న్నారు. అంతే కాకుండా ఇండియ‌న్ 2 గురించి కూడా ప్ర‌త్యేకంగా వెల్ల‌డించారు. ఈ మూవీని త్వ‌ర‌లోనే పునః ప్రారంభించ‌బోతున్నామ‌ని, ఇందుకు సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని తెలిపిన క‌మ‌ల్ ఇక‌పై విరామం లేకుండా సినిమాలు చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల‌వుతున్నార‌ట‌.
Tags:    

Similar News