ఆయనకూ ‘కాటమరాయుడు’ టికెట్ దొరకలేదట

Update: 2017-03-23 07:57 GMT
కాటమరాయుడు’ సినిమాను తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 90 శాతం థియేటర్లలో రిలీజ్ చేసేస్తున్నట్లు అంచనా. వీకెండ్ తర్వాత థియేటర్లు తగ్గిస్తారేమో కానీ.. తొలి మూడు రోజుల్లో మాత్రం ‘కాటమరాయుడు’ లేని థియేటర్లు కనిపించడం కష్టమే అనిపిస్తోంది. ఐతే ఇంత భారీ స్థాయిలో సినిమాను రిలీజ్ చేస్తున్నా సరే.. ‘బుక్ మై షో’ ఓపెన్ చేస్తే అన్ని థియేటర్లలోనూ ‘సోల్డ్ ఔట్’ అనే కనిపిస్తోంది. థియేటర్లను ఎంత పెంచినా డిమాండ్ తగ్గట్లేదని అంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు. స్వయంగా ‘కాటమరాయుడు’ టీంలోని వ్యక్తులకు కూడా టికెట్లు దొరకడం కష్టమవుతోందట. ఈ చిత్రంలో పవన్ తమ్ముడిగా కీలక పాత్ర చేసిన కమల్ కామరాజు ఫ్యామిలీకి కూడా ఈ ఇబ్బంది ఎదురైందట.

కమల్ కామరాజు తండ్రి ‘కాటమరాయుడు’ టికెట్ల కోసం ప్రయత్నిస్తే ఎక్కడా దొరకలేదట. ఆ విషయాన్ని డైరెక్టర్ డాలీ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘‘సినిమాను ముందు అనుకున్నదానికంటే ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నా.. టికెట్లు దొరకట్లేదు. తనకు టికెట్లు దొరకట్లేదని కమల్ కామరాజు తండ్రి కూడా మాదగ్గర వాపోయారు’’ అని డాలీ తెలిపాడు. ఇక పవన్ తో పని చేసిన అనుభవం గురించి డాలీ చెబుతూ... ‘‘ఆయనతో రెండో సినిమా చేసే అవకాశం దక్కడం నా అదృష్టం. అందుకు గర్వంగా ఉంది. పవన్ గారితో స్ట్రెయిట్ సినిమా చేయాలని ఉంది. ఆ విషయంలో నమ్మకంతో ఉన్నా. పవన్ ఈ సినిమా షూటింగులో పాల్గొంటున్నా ఎప్పుడూ ప్రజా సమస్యల గురించే ఆలోచించేవారు. షూటింగ్ గ్యాప్ లో డీమానిటైజేషన్ గురించి.. తమిళనాట రాజకీయ సంక్షోభం గురించి ఆలోచిస్తూ.. చర్చిస్తూ.. మధ్య మధ్యలో నోట్స్ కూడా రాసుకునేవారు’’ అని డాలీ తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News