మిస్టర్‌ సల్మాన్‌ ఖాన్‌ నేనేమి అలా అనలేదు

Update: 2020-06-19 13:00 GMT
సుశాంత్‌ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్‌ లో ఉన్న కొందరు ప్రముఖులపై విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. తమ వారిని మాత్రమే వారు ఎదగనిస్తారు. కొత్త వారిని బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీకి రావాలనుకున్న వారిని ఆరంభంలోనే అంతం చేసేందుకు వారు ప్రయత్నాలు చేస్తారంటూ కొందరిపై నెటిజన్స్‌ విమర్శలు గుప్పిస్తున్నారు. బాలీవుడ్‌ కు చెందిన కొందరి వల్ల బ్యాక్‌ గ్రౌండ్‌ లేని వారు ఛాన్స్‌ లు దక్కించుకోవడమే కష్టం అవుతుందంటూ ప్రముఖ సినీ విమర్శకుడు కమల్‌ ఆర్‌ ఖాన్‌ సోషల్‌ మీడియాలో పేర్కొన్నాడు.

తాజాగా కమల్‌ ఆర్‌ ఖాన్‌ సోషల్‌ మీడియాలో సల్మాన్‌ ఖాన్‌ పై విమర్శలు చేశాడని.. సుశాంత్‌ మరణంకు కారణం అయిన వారిలో సల్మాన్‌ ఖాన్‌ ఒకరు అంటూ కమల్‌ ఆర్‌ ఖాన్‌ వ్యాఖ్యలు చేశాడంటూ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సల్మాన్‌ ఖాన్‌ పీఆర్‌ టీం కమల్‌ ఆర్‌ ఖాన్‌ ను హెచ్చరించారట. దాంతో కమల్‌ ఆర్‌ ఖాన్‌ ట్విట్టర్‌ లో వివరణ ఇచ్చాడు.

ట్విట్టర్‌ లో కమల్‌ ఆర్‌ ఖాన్‌... మిస్టర్‌ సల్మాన్‌ ఖాన్‌ నేను నీకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నేను నీకు వ్యతిరేకం అస్సలే కాదు. పబ్లిక్‌ నీకు వ్యతిరేకంగా ఉన్నారు. వారు నీ గురించి అలాంటి వ్యాఖ్యలు చేశారు. మీడియాలో వస్తున్న వ్యాఖ్యలకు నన్ను తప్పుబట్టడం ఎందుకు.. నన్ను ఈ విషయంలో బ్లేమ్‌ చేయడం ఆపేయండి.

సుశాంత్‌ మరణంకు సల్మాన్‌ కారణం అంటూ నేను మీ గురించి తప్పుగా ట్వీట్‌ చేసినట్లుగా కాని లేదంటే నేను మాట్లాడిన వీడియో కాని ఎవరైనా చూపించగలరా? వందల కొద్ది మీడియా సంస్థలకు నేనేమి బాస్‌ ను కాదు. వాటిలో వార్తలపై నియంత్రణ కలిగి ఉండేందుకు. వాటిలో వచ్చిన వాటిని నేను బాధ్యుడిని కాదు. అయినా కూడా నన్ను సల్మాన్‌ పీఆర్‌ ఎందుకు బ్లేమ్‌ చేస్తున్నాడు అంటూ కమల్‌ ఆర్‌ ఖాన్‌ ట్వీట్‌ చేశాడు.
Tags:    

Similar News