'కరణ్ కొత్త బాయ్‌ ఫ్రెండ్ విజయ్ అనకొండ.. విజయ్ గర్ల్ ఫ్రెండ్ రష్మిక'

Update: 2022-07-13 04:30 GMT
బాలీవుడ్ లో అత్యంత వివాదాస్పద వ్యక్తి.. స్వయం ప్రకటిత విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్. యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గా రెండు మూడు సినిమాలు చేసిన కేఆర్కే.. తనో గొప్ప క్రిటిక్ అని చెప్పుకుంటూ చెత్త రివ్యూస్ ఇస్తూ ఉంటాడు. మనోడి రివ్యూలు ఎలా ఉంటాయంటే.. హిట్ అని చెబితే అది కచ్చితంగా డిజాస్టర్.. ప్లాప్ అని చెబితే అది సూపర్ హిట్ అవుతుంది.

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ మేధావి.. సినిమాల మీద సినీ ప్రముఖులపైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. హీరో హీరోయిన్ల వ్యక్తిగత విషయాలు మరియు ఎఫైర్స్ గురించి కామెంట్స్ చేసి రచ్చ చేస్తుంటాడు. ఈ క్రమంలో సౌత్ ఇండియన్ యాక్టర్స్ పై.. ఇక్కడి సినిమాలపై నోటికొచ్చినట్లుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి.

గతంలో మన హీరోలపై బ్యాడ్ కామెంట్స్ చేసి అభిమానులు కౌంటర్ అటాక్ తట్టుకోలేక చాలాసార్లు క్షమాపణలు కూడా చెప్పాడు. గత కొంతకాలంగా సౌత్ స్టార్స్ ని టచ్ చేయని కేఆర్కే.. ఇప్పుడు టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ ని టార్గెర్ చేసాడు. అది కూడా 'విజయ్ అనకొండ' అని సంబోధిస్తూ తన అక్కసు వెళ్లగక్కాడు.

"సీక్రెట్ మీడియా వార్తల ప్రకారం కరణ్ జోహార్‌ కి కొత్త బాయ్‌ ఫ్రెండ్ విజయ్ అనకొండ! అయితే విజయ్‌ కి రష్మిక గర్ల్ ఫ్రెండ్. అందువల్లనే కరణ్ జోహార్ 5 హిందీ చిత్రాలలో పని చేయడానికి రష్మికకు సహాయం చేశాడు" అని KRK ట్వీట్ చేశాడు.

కరణ్ జోహార్ బాయ్‌ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ అని.. విజయ్ గర్ల్ ఫ్రెండ్ రష్మిక అని చెప్పడంతో ఈ తెలివితక్కువ కథనం కేవలం మీడియా దృష్టిని ఆకర్షించే ప్రయత్నం మాత్రమే అని స్పష్టంగా అర్థం అవుతోంది.

విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నా సెల్ఫ్ మేడ్ స్టార్స్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. కెరీర్‌ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు. ప్రస్తుతం ఇద్దరూ నేషనల్ వైడ్ పాపులారిటీ తెచ్చుకునేందుకు కృషి చేస్తున్నారు.

VD ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ముఖ్యంగా హిందీలో సినిమా రిలీజ్ కాకముందే బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. మరోవైపు సౌత్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న రష్మిక.. ప్రస్తుతం హిందీలో వరుస అవకాశాలు అందుకుంటోంది.

ఇలా విజయ్ - రష్మిక నార్త్ లో సత్తా చాటడానికి రెడీ అవుతుంటే.. కేఆర్కే లాంటి వ్యక్తులు మాత్రం హద్దులు దారి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించే పనిలో చెత్త రాతలు రాసే KRK వంటి కామెడీ పీస్ కామెంట్స్ ను అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదని మరికొందరు అంటున్నారు. విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నా కూడా ఇలాంటి ట్వీట్స్ ని ట్వీటకులను పట్టించుకోరని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News