పెళ్లై..పిల్ల‌లున్నా పెళ్లి చేసుకోమ‌ని వెంట‌ప‌డేవార‌ట‌!

Update: 2023-06-01 07:00 GMT
కోలీవుడ్ లెజెండ్ జెమినీ గ‌ణేష్ న‌టుడి గా ఎంత ఫేమ‌స్ అయ్యారో చెప్పాల్సిన ప‌నిలేదు. భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కి ఆయ‌న అందించిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం. ఎన్నో సినిమాల్లో న‌టించి న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని సంపాదించుకున్నారు.

ఇక ఆయ‌న బ్యూటీ గురించి చెప్పేదేముందుంది గొప్ప అంద‌గాడు. ఉంగ‌రాల జుత్తు...ఒడ్డు పొడ‌వు తో అప్ప‌టి యువ‌త‌ కి ఓ ఐకాన్ గా నిలిచారు. అలాగే వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న వివాహాలు అంతే ఫేమ‌స్. తెలుగు న‌టి సావిత్రి ని వివాహం చేసుకోవ‌డం..దూరం అవ్వ‌డం  తెలిసిందే.

ఆ త‌ర్వాత ఎవ‌రి జీవితాల్లో వాళ్లు బిజీ అయ్యారు. తాజాగా ఓఇంట‌ర్వ్యూలో జెమినీ గ‌ణేష‌న్ కుమార్తె క‌మ‌లా గ‌ణేష‌న్ తండ్రి గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు.  'మా డాడీ చాలా హ్యాండ్సమ్ గా ఉండేవారు.  ముఖ్యం గా ఆయన హెయిర్ స్టైల్ ఎంతో బాగుండేది. పిల్లలందరి  నీ ఆయన ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ప్రతిరోజు  మా డాడీ ని చూడటానికి ఎంతోమంది అమ్మాయిలు వచ్చేవారు. తమని పెళ్లి చేసుకోమని చాలామంది అడిగేవారు.  తనకి ఇంత‌కు ముందే  పెళ్లి అయిందని వారికి నచ్చజెప్పి పంపించేవారు.

ఇక సావిత్రి గారిని పెళ్లి  చేసుకోవ‌డం అన్న‌ది విధిరాత‌గా చెప్పాలి. డాడీ ఎవ‌ర్నీ ఫోర్స్ చేయ‌లేదు. ఒక‌రికొక‌రు ఇష్ట‌ప‌డే వివాహం చేసుకున్నారు. ఆ త‌ర్వాత అనివార్య కార‌ణ‌ల‌తో దూరం అయ్యారు. న‌టుడి గా మా డాడీ కి స్టార్ ఇమేజ్ ఉంది. ఆయ‌న జీవితంలో ఎన్ని సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నా ఆయ‌న ఇమేజ్ ఏ ద‌శ‌లో నూ దెబ్బ తిన‌లేదు. అవ‌కాశాలు లేక ఇబ్బంది ప‌డ్డారు? అని   అప్ప‌టి మీడియాలో వ‌చ్చిన వార్త‌ల్లో నిజం లేదు. ఆయ‌న గురించి మ‌హానటి సినిమా లో త‌ప్పుగా చూపించారు.

బ‌య‌ట జ‌రిగింది వేరు. ఆ సినిమా లో చూపించింది వేరు. నాన్న గురించి చాలా విష‌యాలు చూపించాలి ఆ క‌థ‌లో. కానీ అలా ప్రోజెక్ట్ చేయ‌లేదు. సావిత్రి గారిని నేను చూశాను . ఆమె మాతో చాలా చక్కగా మాట్లాడేవారు. మా అమ్మగారు కూడా ఆమె తో చాలా ఆత్మీయంగా ఉండేవారు' అని తెలిపారు.

Similar News