బొమ్మరిల్లు మూవీతో దాదాపు స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న సిద్ధార్ధ్.. ఆ తర్వాత పేస్ కంటిన్యూ చేయలేకపోయాడు. తమిళ్ కి వెళ్లి సెటిల్ అయిపోయాక.. రీసెంట్ గా వచ్చిన గృహం చిత్రం మాత్రమే ఆకట్టుకోగలిగింది. అయితే.. విభిన్నమైన కాన్సెప్టులతో సినిమాలు చేయడంలో మాత్రం ఆరితేరిపోతున్నాడు సిద్ధార్ధ్.
కోర్టు కేసులతో తెగ ఇబ్బందుల్లో ఉన్న మలయాళ హీరో దిలీప్ ప్రధాన పాత్రలో రూపొందిన మూవీ కమ్మార సంభవం. దిలీప్ ను జైల్లో ఉంచడంతో షూటింగ్ కి బ్రేక్ పడగా.. బెయిల్ పై బైటకు వచ్చినప్పటి నుంచి షూటింగ్ కొనసాగిస్తున్నారు. ఇప్పుడీ చిత్రానికి టీజర్ రిలీజ్ చేశారు. స్వతంత్రం రావడానికి పూర్వం.. ఈ చిత్రానికి కథాకాలం. పీరియాడిక్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో.. హీరోకి పోటాపోటీగా ఉండే పాత్రలో సిద్ధార్ధ్ నటించాడు. టీజర్ లోనే వీరిద్దరి మధ్య వైరాన్ని చూపించాడు దర్శకుడు రతీష్ అంబట్.
కమ్మార సంభవం ఫస్ట్ లుక్ కి మంచి టాక్ రాగా.. ఇప్పుడు టీజర్ ద్వారా అంచనాలను మరింతగా పెంచేస్తోంది. ఇది సిద్ధార్ధ్ కు మలయాళ అరంగేట్ర మూవీ కావడంతో.. సినిమాపై చాలానే హోప్స్ పెట్టుకున్నాడు ఈ హీరో. సమ్మర్ లో విడుదల కానున్న ఈ చిత్రం ద్వారా.. మల్లూవుడ్ లో సెటిల్ కావాలని చూస్తున్నాడు సిద్ధార్ధ్. మరోవైపు బెయిల్ పై వచ్చిన తర్వాత రిలీజ్ అవుతున్న దిలీప్ తొలి చిత్రం కావడంతో ఫ్యాన్స్ కూడా ఆసక్తిగానే ఉన్నారు.
టీజర్ కోసం క్లిక్ చేయండి
Full View