ఇప్పటివరకూ షూటింగులకే పరిమితమైన విశాఖ నగరానికి.. ఇప్పుడు మరింత సినిమా కళ వస్తోంది. మొదటిసారిగా ఓ పెద్ద సినిమాకి ఆడియో ఫంక్షన్ విశాఖలో చేయబోతున్నారు. మెగా వారసుడు నాగబాబు తనయుడు నటించిన కంచె ఆడియో ఫంక్షన్ ని.. వైజాగ్ లో గ్రాండ్ గా జరపాలని నిర్ణయించారు.
ఇక్కడే కంచె ఆడియో రిలీజ్ చేయడానికి ఓ ప్రధాన కారణం కూడా ఉంది. 1942 ఏప్రిల్ 6న ఏం జరిగిందో తెలుసా అంటూ.. వరుణ్ తేజ్ ఇచ్చిన పజిల్ కారణంగా లింక్ విషయం బైట పడింది. ఆ రోజున రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా జపాన్ ఎయిర్ ఫోర్స్ వైజాగ్ పై బాంబులు కురిపించాయి. పోర్ట్ లో ఉన్న ఓ షిప్ పై పడ్డ బాంబ్ పేలలేదు. ఆ షిప్ లో కొన్ని వేల టన్నుల పేలుడు సామాగ్రి ఉంది. ఒక వేళ పైనుంచి పడ్డ ఆ బాంబ్ పేలితే.. కింద షిప్ లో మందుగుండు సామాగ్రితో కలిపి.. మొత్తం వైజాగ్ ని భస్మీపటలం అయిపోయేది.
ఇప్పుడు కంచె రెండో ప్రపంచయుద్ధానికి సంబంధించిన స్టోరీయే. వైజాగ్ కి ఆ యుద్ధంతో లింక్ ఉంది. అందుకే సెప్టెంబర్ 17న కంచె ఆడియో విశాఖ లో ప్లాన్ చేశాడు డైరెక్టర్ క్రిష్. విశాఖలో గ్రాండ్ ఫంక్షన్ చేసుకోబోతున్న తొలి స్టార్ స్టేటస్ సినిమా ఇదే కావడం విశేషం. పోర్ట్ స్టేడియంలో ఈ ఫంక్షన్ చేస్తున్నామని చెప్పింది కంచె యూనిట్. ఆడియో రిలీజ్ అవ్వగానే అందరూ అదే పాటలతో హ్యాపీగా బీచ్ లో తేలియాడొచ్చనమాట.
అసలు అడియో ఫంక్షన్ చేయబోతున్నామన్న ఒక లింక్ కోసమే ఇంత రీసెర్చ్ జరిగింది. మరి మొత్తం మూవీ కోసం ఎంతగా కష్టపడి ఉంటాడో దర్శకుడు? ఓ సినిమా కోసం ఇంత రీసెర్చ్ చేస్తాడు కాబట్టే.. క్రిష్ ని క్రియేటర్ అంటారు ఇండస్ట్రీలో.