‘1 నేనొక్కడినే’ను అందరూ మంచి సినిమా, గొప్ప సినిమా అన్నారు. కానీ ఆ సినిమా కమర్షియల్ గా ఎలాంటి ఫలితం చూసిందో అందరికీ తెలిసిందే. మహేష్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిందా సినిమా. ఈ ఏడాది ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ కూడా మంచి సినిమాగానే పేరు తెచ్చుకుంది. కానీ కాసులు మాత్రం రాలలేదు. మంచి సినిమా అని గుర్తింపు తెచ్చుకున్న సినిమాలన్నింటికీ ప్రేక్షకులు పట్టం కట్టేస్తారని అనుకోవడానికేమీ లేదు. నిజానికి మరీ మంచి సినిమా అని పేరొస్తే అసలుకే మోసం వస్తుంది. అలాంటి సినిమాలకు కాసులు రావు. మరి ‘కంచె’ సినిమా పరిస్థితి ఏమవుతుందా అనేదే తేలాల్సి ఉంది.
నిన్నట్నుంచి చాలామంది ‘కంచె’ను గొప్ప ప్రయత్నం అని.. మంచి సినిమా అని పొగుడుతున్నారు. కానీ సగటు తెలుగు ప్రేక్షకుడికి మాత్రం ఈ సినిమా రుచిస్తుందా లేదా అనేది డౌటుగా ఉంది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ నుంచి వస్తున్న టాక్ వేరేలా ఉంది. డల్లుగా ఉందని.. స్లో అని.. ఎంటర్ టైన్ మెంట్ లేదని.. ఇలాంటి అభ్యంతరాలు చెబుతున్నారు జనాలు. కలెక్షన్లు కూడా ఆశించిన స్థాయిలో లేవు. హీరో హీరోయిన్లద్దరినీ చంపేయడం కథ రీత్యా కరెక్టే కానీ.. అది మాస్ ఆడియన్స్ కు రుచించడం లేదని.. కమర్షియల్ వాల్యూస్ లేకపోవడంతో కాబట్టి బి, సి సెంటర్లలో కలెక్షన్లు డల్లుగా ఉన్నాయని అంటున్నారు. మరి చివరికి సినిమా ఫలితం ఎలా ఉంటుందో.. క్రిష్ పెట్టిన 20 కోట్ల పెట్టుబడి తిరిగొస్తుందో లేదో చూడాలి.