చిత్రం : ‘కంచె’
నటీనటులు- వరుణ్ తేజ్ - ప్రగ్య జైశ్వాల్ - నికితిన్ ధీర్ - అవసరాల శ్రీనివాస్ - గొల్లపూడి మారుతీరావు - షావుకారు జానకి - పోసాని కృష్ణమురళి - రాజేష్ - సింగీతం శ్రీనివాసరావు తదితరులు
ఆర్ట్- సాహి సురేష్
ఛాయాగ్రహణం- జ్నానశేఖర్
సంగీతం- చిరంతన్ భట్
సాహిత్యం- సిరివెన్నెల సీతారామశాస్త్రి
మాటలు- సాయిమాధవ్ బుర్రా
నిర్మాతలు- రాజీవ్ రెడ్డి - సాయిబాబు
రచన - దర్శకత్వం - క్రిష్
తెలుగులో ఇలాంటి సినిమానా.. ‘కంచె’ చూసిన నాటి నుంచి అందరిదీ ఇదే మాట. అందుకే ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఎదురు చూశారు. మొత్తానికి ఇవాళ థియేటర్లలో అడుగుపెట్టింది ‘కంచె’. మరి సినిమా చూశాక ఎలాంటి భావన కలుగుతుంది? చూద్దాం పదండి.
కథ:
ఇది రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి నేపథ్యంలో సాగే కథ. ధూపాటి హరిబాబు (వరుణ్ తేజ్) ఓ తక్కువ కులానికి చెందిన కుర్రాడు. అతను, జమీందార్ల వంశానికి చెందిన సీత (ప్రగ్య జైశ్వాల్)ను ప్రేమించుకుంటారు. ఐతే కులం తక్కువ వాడని హరిబాబుతో సీత పెళ్లికి ఒప్పుకోడు ఆమె అన్నయ్య ఈశ్వర్ (నికితిన్ ధీర్). ఇది గతానికి సంబంధించిన వ్యవహారం. వర్తమానంలోకి వస్తే.. ఈశ్వర్ - హరిబాబు కలిసి బ్రిటిష్ సైన్యం తరఫున ఇటలీలో జర్మన్ దళాలకు వ్యతిరేకంగా పోరాడతారు. వారి మీదికి శత్రు సేనలు దాడి చేస్తాయి. ఆ దాడి ఈశ్వర్ సహా తమ సైన్యాధికారులు కొందరు బంధీలుగా చిక్కుతారు. వారిని విడిపించేందుకు హరిబాబు తన బృందంతో కలిసి పోరాటం కొనసాగిస్తాడు. ఈ పోరాటంలో అతను గెలిచాడా? మరోవైపు అతడి ప్రేమకథ ఏ కంచికి చేరింది? అన్నది తెరమీదే చూసి తెలుసుకోవాలి.
కథనం - విశ్లేషణ:
పొరుగున ఉన్న తమిళ పరిశ్రమ నుంచి అప్పుడప్పుడూ కొన్ని మంచి సినిమాలు మనల్ని పలకరిస్తుంటాయి. ఆ మధ్య కమల్ హాసన్ ‘విశ్వరూపం’ చూసి ఇలాంటి అంతర్జాతీయ స్థాయి సినిమాలు మనోళ్లు ఎప్పుడు తీస్తారు అనుకున్నాం. అంతకుముందు ‘మదరాసు పట్టణం’ అనే చూసి ఇలాంటి ఆలోచనలు మనోళ్లకు ఎందుకు రావు అనుకున్నాం. ఐతే అలాంటి సినిమా మనకూ ఒకటుందని చెప్పుకోవడానికి మన దగ్గరా ఇప్పుడో మంచి ప్రయత్నం జరిగింది. అదే.. కంచె.
సినిమాల ద్వారా వినోదాన్నే కాదు.. కాస్త విజ్నానాన్ని కూడా పంచే సినిమాలు.. చాలా అదురుగా వస్తాయి. ‘కంచె’ ఆ కోవకు చెందిన సినిమానే. అంత పెద్ద ప్రపంచ యుద్ధం నేపథ్యాన్ని అర్థం చేసుకుని.. ఆ యుద్ధానికి సంబంధించి మనకు తెలియని కోణాల్ని చాలా తక్కువ సన్నివేశాలతో చెప్పే ప్రయత్నం చేసిన క్రిష్.. మనకు తెలిసినా పట్టించుకోని మంచి విషయాల్ని కూడా యుద్ధానికి ముడిపెట్టి ఆలోచింపజేసే సినిమా చేశాడు. కులం కట్టుబాట్లు ఇద్దరు ప్రేమికులకు ఎలా అడ్డంకిగా మారాయన్న కోణంలో లెక్కలేనన్ని సినిమాలు చూసి ఉంటాం. ఐతే ఇక్కడ ఇలాంటి కథకే ప్రపంచ యుద్ధాన్ని జోడించడమే ‘కంచె’ ప్రత్యేకత.
ఓ పక్క యుద్ధానికి సంబంధించిన కథానాయకుడి వీరోచిత గాథ.. మరోవైపు ఫ్లాష్ బ్యాక్ లో హీరో ప్రేమకథ.. రెండూ సమాంతరంగా సాగేలా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు క్రిష్. చివరికి రెంటినీ ముడిపెట్టి.. సినిమాకు ఓ అర్థవంతమైన ముగింపునిచ్చాడు. కథనం నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలిగితే కలగొచ్చు కానీ.. ఆసక్తి మాత్రం తగ్గదు. సినిమా ఆరంభంలోనే వచ్చే పది నిమిషాల వార్ ఎపిసోడ్ ను తనకున్న బడ్జెట్ లిమిటేషన్స్ లోనే అద్భుతంగా తీర్చిదిద్దింది క్రిష్ బృందం. అప్పటి వాతావరణాన్ని, ఆయుధాల్ని, యుద్ధ యంత్రాల్ని గుర్తుకు తెచ్చేలా సెట్ ప్రాపర్టీస్ అన్నీ సమకూర్చుకోవడమే కాదు.. చాలా రియలిస్టిక్ గా ఉండేలా ఆ సన్నివేశాల్ని తీర్చిదిద్దాడు క్రిష్.
ఐతే ఆరంభంలోనే యుద్ధం చూపించేశాక.. ఆ తర్వాత హీరో జర్నీని ఉత్కంఠ రేకెత్తిస్తూ చివరిదాకా కొనసాగించడం అంత సులువు కాదు. క్రిష్ ఆ పనిని బాగానే పూర్తి చేశాడు. యుద్ధం తర్వాత మరో రెండు మూడు సందర్భాల్లో జర్మన్ సైన్యానికి, హీరో బృందానికి మధ్య జరిగే దాడులకు సంబంధించిన సన్నివేశాల్ని కూడా ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా తీశాడు క్రిష్. హీరో మిషన్ కు మధ్యలో బ్రేక్ వేసి.. మధ్యలో ‘పాప’ సెంటిమెంటు వైపు మళ్లించడం ప్రేక్షకులు మరింత ఎమోషనల్ గా ఈ సన్నివేశాలతో కనెక్టవడానికి దోహం చేస్తుంది.
అసలు రెండో ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగింది? ఆ సమయంలో హిట్లర్ దురాగతాలు ఎలా సాగాయి? అనే విషయాల్ని ఆసక్తికరంగా చూపించాడు క్రిష్. దీనికి సంబంధించిన సన్నివేశాలు చూస్తుంటే ఓ హాలీవుడ్ సినిమా చూస్తున్న భావన కలుగుతుంది. ఐతే మధ్య మధ్యలో కట్ చేసి మామూలు తెలుగు సినిమా కూడా చూపిస్తాడు క్రిష్. ఫ్లాష్ బ్యాక్ లో సాగే ఆ సన్నివేశాలు మామూలుగానే అనిపిస్తాయి. ఆ సన్నివేశాల్లో అంత ఎమోషనల్ డెప్త్ లేదు. పైగా ఆ ఎపిసోడ్ కు సంబంధించిన కథనమంతా ప్రేక్షకుడి అంచనాలకు తగ్గట్లు సాగుతుంది. ఆసక్తికర మలుపులేమీ లేవు. హీరో హీరోయిన్ల ప్రేమకథను ఇంకాస్త లోతుగా చూపించాల్సింది. ఒక మంచి పాటతో తేల్చేశాడు. హీరోయిన్ తో హీరో పెళ్లికి సంబంధించిన సన్నివేశం బావుంది. ఐతే ఆ తర్వాతి సన్నివేశంలో హీరోయిన్ పాత్రకు ముగింపు పలికిన సీన్ అనుకున్నంత బాగా రాలేదు. ప్రేక్షకుడిని ఎమోషనల్ గా కట్టిపడేయాల్సిన సీన్ తేలిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. హీరో ఫ్లాష్ బ్యాక్ ను కొన్ని మలుపులతో ఆసక్తికరంగా రాసుకోవాల్సింది. సినిమాకు మైనస్ ఈ ఎపిసోడే.
తాను చెప్పాలనుకున్న విషయంలో క్రిష్ రాజీ పడలేదు. అతనెంత పెద్ద రిస్క్ చేశాడంటే.. హీరోయిన్ పాత్రను ముందే ముగించేశాడు. చివరికి హీరోను కూడా చంపేసి సినిమాను విషాదాంతం చేశాడు. ఐతే సినిమాకు ఆ ముగింపు సరైందే అన్న భావన ప్రేక్షకుడికి కలిగించడంలో అతను విజయవంతమయ్యాడు. నిస్సందేహంగా ‘కంచె’ గొప్ప ప్రయత్నం. కమర్షియల్ లెక్కలేసుకోకుండా నిజాయితీగా ఓ మంచి కథ చెప్పే ప్రయత్నం చేశాడు క్రిష్. కథనం నెమ్మదిగా ఉందనిపించొచ్చు. సీరియస్ సినిమా కావడం వల్ల.. కమర్షియల్ హంగులు లేకపోవడం వల్ల సినిమా కొంచెం భారంగా కదిలిన ఫీలింగ్ కలగొచ్చు. ఐతే క్రిష్ ఓ మంచి ప్రయత్నం చేశాడు కాబట్టి ఇలాంటి మైనస్ లను మన్నించొచ్చు.
నటీనటులు:
‘ముకుంద’లో చూసిన వరుణ్ కి, ‘కంచె’లో వరుణ్ కి చాలా తేడా ఉంది. రెండో సినిమాకే అతను చాలా పరిణతి చెందాడు. అసలు కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి పాత్ర చేయడానికి సాహసించినందుకు అతణ్ని ముందు అభినందించాలి. నటన విషయంలోనూ అతను మంచి మార్కులేయించుకున్నాడు. హరిబాబు పాత్ర తాలూకు ఇంటెన్సిటీని అతను చూపించాడు. యుద్ధ సన్నివేశాల్లో, ఎమోషనల్ సీన్స్ లో మెచ్యూరిటీతో నటించాడు. పెద్దగా భావాలు పలికించలేడని.. చురుకుదనం లేదని తొలి సినిమాతో వచ్చిన విమర్శలు ఈ సినిమాతో పక్కకు వెళ్లిపోతాయి. సినిమా కోసం అతను పడ్డ కష్టం కూడా తెరమీద కనిపిస్తుంది. వరుణ్ డైలాగ్ గెలివరీ కూడా బాగుంది. హీరోయిన్ ప్రగ్య జైశ్వాల్ కూడా బాగా చేసింది. తెలుగు సినిమాల్లో ఓ హీరోయిన్ నటించడం చాన్నాళ్ల తర్వాత చూస్తాం. రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్లకున్న క్వాలిటీస్ తక్కువే కానీ.. ఈ సినిమా వరకు ఆమె సరిపోయింది. విలన్ గా చేసిన నికితిన్ ధీర్ కూడా బాగా చేశాడు. షావుకారు జానకి రెండు మూడు ముఖ్యమైన సన్నివేశాల్లో మంచి డైలాగులతో తన పాత్రకు న్యాయం చేసింది. గొల్లపూడి తన పాత్రలో జీవించేశారు. సీరియస్ గా సాగే సినిమాలో అవసరాల శ్రీనివాస్ అక్కడక్కడా తనదైన శైలిలో పంచ్ లు వేస్తూ రిలీఫ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అతడి డైలాగ్ డెలివరీ సూపర్బ్.
సాంకేతిక వర్గం:
చిరంతన్ భట్ పాటలన్నీ కథనంలో ఇమిడిపోయాయి. ‘అటు ఇటు..’ పాట తప్పితే మిగతావి అంత శ్రావ్యంగా లేవు కానీ.. క్రిష్ పాటలన్నీ కథనంలో ఇమిడిపోయేలా వాటిని ప్లేస్ చేశాడు. పాటలు వింటున్నపుడు సీతారామశాస్త్రి గుర్తుకు రాక మానరు. ఎమోషనల్ సన్నివేశాలకు, వార్ సీన్స్ కు చిరంతన్ తన నేపథ్య సంగీతంతో ప్రాణం పోశాడు. సాహి సురేష్ ఆర్ట్ వర్క్ ను కూడా ప్రత్యేకంగా ప్రశంసించాలి. నిర్మాణ విలువల విషయంలోనూ క్రిష్ ను అభినందించాలి. సాయిమాధవ్ మాటల్లో ఆణిముత్యాలు ఒకటా రెండా. ఇష్టానికి, ప్రేమకు తేడా చెబుతూ.. ‘పువ్వు మీద ఇష్టం ఉంటే కోస్తాం. ప్రేమ ఉంటే మొక్కకు నీళ్లు పోస్తాం’ అంటూ రాసిన ఓ డైలాగ్ చాలు అతడి మాటల గొప్పదనం గురించి చెప్పడానికి. ఇలాంటి అద్భుతమైన మాటలు సినిమాలో లెక్కలేనన్ని ఉన్నాయి. సినిమాకు మాటలు ప్రధాన ఆకర్షణ అనడంలో సందేహం లేదు. ఇక డైరెక్టరుగా క్రిష్ సిన్సియారిటీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ‘గమ్యం’ తర్వాత మళ్లీ అతడిలో నిజాయితీని వంద శాతం ఈ సినిమాలోనే చూస్తాం. వేదం, కృష్ణం వందే జగద్గురుం సినిమాల విషయంలో క్రిష్ కొంచెం రాజీ పడ్డాడు కాబట్టి అవి కొంచెం కంగాళీగా తయారయ్యాయి. కానీ ‘కంచె’ విషయంలో అతనెక్కడా రాజీ పడలేదు. తాను నమ్మింది తీశాడు. తన ఆలోచనల్ని అనుకున్నవి అనుకున్నట్లు తెరమీదికి తెచ్చాడు.
చివరగా: మంచి ప్రయత్నం ... మంచి సినిమా
రేటింగ్- 3/5
#kanche, #Kanchereview, #kanchetalk, #kanchemovie, #VaruntejKanche, #VaruntejkancheReview, #Kancherating,
Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre