బాలీవుడ్ నటి కంగనారనౌత్ సోదరి రంగోలి గురించి అందరికి తెలిసిందే. ఇండస్ట్రీలో ఎవరైనా కంగనా జోలికి వస్తే ఆమె సోదరి రంగోలి ఓ ఆట ఆడుకుంటుంది. కంగనా రనౌత్ వివాదల లిస్ట్ లో హృతిక్ రోషన్ నుంచి సోనమ్ కపూర్ వరకు చాలామంది ఉన్నారు. హృతిక్ తనకు అభ్యంతరకరమైన ఇమెయిల్స్ పంపించాడని కోర్టు వరకు వెళ్లిన కంగనా ఖాతాలో చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. అయితే కంగనా సోదరి ఆ వివాదాలకు మరింత ఆద్యం పోస్తూ వాటిని పెద్దవి చేసేది. నిత్యం ఎదో ఒక వివాదంతో నెట్టింట హల్ చల్ చేస్తుంటుంది రంగోలి. ఆ మధ్య తాజ్ మహల్ విషయంలో, ఇటీవల ఫిలింఫెర్ అవార్డుల విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసాయి. రంగోలి చేసే ట్వీట్ల పై నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ఇటీవలే రంగోలికి ట్విట్టర్ షాక్ ఇచ్చింది. ట్విట్టర్ నుంచి రంగోలి అకౌంట్ ను తొలగించడం జరిగింది.
తన సిస్టర్ రంగోలి ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ చేయడం పై నటి కంగనా స్పందించింది. ఒక వీడియో రూపంలో తన సిస్టర్ ఎలాంటి తప్పు చేయలేదంటూ పట్టుబట్టి చెబుతుంది. ఇంస్టాగ్రామ్ వీడియోలో.. వివరణ ఇస్తూ.. ఈ ప్రజాస్వామ్య ప్రపంచంలో మాట్లాడే హక్కు గురించి, దాని ప్రాముఖ్యత గురించి చెప్పుకొచ్చింది. అయితే నా సిస్టర్ రంగోలి ఎలాంటి ముస్లింల మారణహోమాన్ని ప్రోత్సహించలేదని వాపోయింది. సోషల్ మీడియాలో ఉగ్రవాదులు అని కామెంట్స్ చేయడం ఇబ్బంది కలిగించిందని తన మనసులో మాట బయటపెట్టింది. వారిని వివాదాలకు గురిచేసిన వెబ్ సైట్లను మూసేయాలని చెప్తూ.. నవ్వు ముఖంతో హ్యాపీ లాక్ డౌన్ అని సెలవిచ్చింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.