ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రజాధరణ కలిగిన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ ను ఇటీవలే ఎలాన్ మస్క్ కొనుగోలు చేసి విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తున్న విషయం తెల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ గురించి ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలోనే ట్విట్టర్ కి సంబంధించిన పలు సూచనలు సలహాలను జనాలు ఎలాన్ మస్క్ కి ఇస్తున్నారు.
ఎలాన్ మస్క్ ప్రస్తుతం ఇండియా పై దృష్టి పెట్టాడని.. ఇండియాలో బ్లూ టిక్ ఉన్న వారి నుండి భారీ మొత్తంలో డబ్బు వసూళ్లు చేయబోతున్నట్లుగా గత కొని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ సమయంలోనే ఇండియాలో ట్విట్టర్ కొత్త పాలసీలను తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ట్విట్టర్ లో బ్లూ టిక్ ఉన్న వారు ఇక నుండి 8 డాలర్ల చొప్పున నెల నెలకు చెల్లించాల్సి ఉంటుందట. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా ట్విట్టర్ బ్లూ టిక్ విషయంలో కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలను చేయడం జరిగింది.
ట్విట్టర్ లో ఫేక్ అకౌంట్స్ విషయంలో మస్క్ జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచించడంతో పాటు బ్లూ టిక్ కలిగి ఉన్న వారి యొక్క ఆధార్ ను ట్విట్టర్ అకౌంట్ కు లింక్ చేయాలని ఆమె సూచించింది. ఒక వేళ ట్విట్టర్ అకౌంట్ కి ఆధార్ లింక్ చేస్తే తప్పకుండా చాలా వరకు అసత్యాలు ప్రచారం అవ్వవు అని.. ఒకరి పై ఒకరు దూషణలకు దిగరు అన్నట్లుగా ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.
వెరిఫికేషన్ తో ఇచ్చే బ్లూ టిక్ ను తప్పనిసరిగా ఎక్కువ శాతం మందికి ఇవ్వాలి అంటూ కూడా ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వెరిఫికేషన్ విధానం కొద్ది మందికి మాత్రమే ఎందుకు పరిమితం అవుతుందో తనకు అర్థం కావడం లేదు అన్నట్లుగా ఈ సందర్భంగా కంగనా చెప్పుకొచ్చింది. మరి కంగనా యొక్క సలహాను.. డిమాండ్ ను మస్క్ పట్టించుకుంటాడా అనేది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.