నీలి చిత్రంలో తొలి ఆఫ‌ర్ వ‌చ్చిందా..!

Update: 2017-01-02 09:26 GMT
సినిమా కెరీర్ లో తొలి సినిమా చాలా ముఖ్య‌మైంది. ఆ సినిమా తెచ్చిపెట్టే ఇమేజ్ ఆధారంగానే కెరీర్ ఆధార‌ప‌డుతుంది. భ‌విష్య‌త్తు అవ‌కాశాల‌ను ప్ర‌భావితం చేస్తుంది. హీరోయిన్ల విష‌యంలో ఇంకా ఎక్కువ ప్ర‌భావం ఉంటుంది. తొలి సినిమాలో గ్లామ‌ర‌స్ గా క‌నిపిస్తే... ఆ త‌రువాతా అలాంటి హాట్ హాట్ పాత్ర‌లే వ‌స్తాయి. ఇలాంటి ఆఫ‌ర్ గురించి కంగ‌న ఇప్పుడు చెబుతోంది. జాతీయ అవార్డు గ్ర‌హీత కంగ‌నా ర‌నౌత్ అన‌గానే అంద‌రికీ గుర్తొచ్చేది గ్యాంగ్ స్ట‌ర్. ఆ చిత్రంతోనే బాలీవుడ్ లో ఆమెకి బ్రేక్ వ‌చ్చింది. భావోద్వేగాల‌తో కూడుకొన్న పాత్ర‌ల‌ను కంగ‌నా ఈజీగా పోషించ‌గ‌ల‌దు అనే ఇమేజ్ తెచ్చుకుంది. అయితే, ఆ సినిమా కంటే ముందు త‌న‌కు ఓ ఆఫ‌ర్ వ‌చ్చిందనీ... ఆ సినిమా చేసి ఉంటే త‌న కెరీర్ ఇంకోలా ఉండేదేమో అని కంగ‌నా అంటోంది!

గ్యాంగ్ స్ట‌ర్ కంటే ముందే కంగ‌నా ఇంకో చిత్రం క‌మిట్ అయింది. ఆ రోజుల్లో... అంటే త‌నకు ఓ ప‌దిహేడు ప‌ద్దెనిమిదేళ్లు వ‌య‌సులో ఉన్న‌ప్పుడు మొద‌టి సినిమా ఆఫ‌ర్ వ‌చ్చింది. సినిమాలో అవ‌కాశం వ‌స్తే చాల‌నుకున్న స‌మ‌యంలో ఆ పాత్ర న‌టించేందుకు తాను ఒప్పుకున్నాన‌నీ... కానీ త‌రువాత అర్థ‌మైంది ఏంటంటే ఆ పాత్ర కాస్త తేడాగా ఉంద‌ని కంగ‌నా ఇప్పుడు గుర్తు చేసుకుంది. అది మంచి సినిమా కాద‌నే విష‌యం ఫొటో షూట్ అయ్యాక అర్థ‌మైంద‌నీ, కానీ ఏదో ఒక అవ‌కాశం వ‌చ్చింది క‌దా అని స‌ర్దిచెప్పుకున్నాన‌ని అంటోంది. ఒక ద‌శ‌లో త‌న పాత్ర‌కు వేసుకోవాల్సిన దుస్తుల్ని చూసేస‌రికి... ఇదేదో నీలి చిత్ర‌మేమో అనే భ‌యం త‌న‌కు క‌లిగింద‌ని కంగ‌న ఆందోళ‌న చెందిద‌ట‌. హీరోయిన్ కాస్ట్యూమ్ రోబ్ ఓపెన్ చేసి చూసేస‌రికి దుస్తులే లేవ‌ట‌!

ఇలాంటి సినిమా తాను చేయ‌కూడ‌ద‌ని రానురానూ అర్థ‌మైంద‌ని అంది. ఆ స‌మ‌యంలోనే గ్యాంగ్ స్ట‌ర్ అవ‌కాశం రావ‌డంతో.. ఆ ప్రాజెక్టు నుంచి బ‌య‌ట‌కి వ‌చ్చేశాన‌ని కంగ‌న చెప్పింది. అయితే, ఆ ప్రాజెక్టు నుంచి బ‌య‌ట‌కి వ‌చ్చిన త‌రువాత కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌చ్చింద‌ట‌. ఆ నిర్మాత చాన్నాళ్ల‌పాటు త‌న‌పై చాలా ఆగ్ర‌హంగా ఉండేవాడ‌ని అంది. ఆ వ‌య‌సులో ఏదో ఒక సినిమా చేసేద్దామ‌నే ఆతృత త‌ప్ప‌... ఎలాంటి పాత్ర చేయ‌డం ద్వారా ప్రేక్ష‌కులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ఆలోచించ‌గ‌లిగే మెచ్యూరిటీ అప్ప‌ట్లో త‌న‌కు లేద‌ని కంగ‌న ఆ విష‌యాన్ని గుర్తు చేసుకుంటోంది. నిజ‌మే క‌దా... తొలి చిత్రమే అలాంటి పెద్దల చిత్ర‌మైతే కంగ‌న ఇమేజ్ ఇంకోలా ఉండేదేమో క‌దా!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News