'కాంతారా'పై కంగనా రివ్యూ.. వారమైన కోలుకోరట..!

Update: 2022-10-21 16:30 GMT
ప్రతీయేటా కొన్ని వందలాది సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. వీటిలో కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. అయితే ప్యాన్ ఇండియా సినిమాల ట్రెండ్ వచ్చినప్పటి నుంచి టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా ఇటీవల కాలంలో సినిమాలన్నీ కూడా అన్ని భాషల్లో ఒకేసారి రిలీజు అవుతున్నాయి.

వీటిలో 'కేజీఎఫ్-2', 'ఆర్ఆర్ఆర్', 'కార్తీకేయ-2' వంటి సినిమాలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి. సౌత్ సినిమాలకు నార్త్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతుండటంతో బాలీవుడ్ సినిమాల కంటే కూడా మన సినిమాలే అక్కడ ఎక్కువగా ఆడుతున్నాయి. కన్నడ ఇండస్ట్రీకి చెందిన 'కేజీఎఫ్-2' ఇండియా వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది.

ఈ తరహాలోనే అదే ఇండస్ట్రీకి చెందిన 'కాంతారా' మూవీ విడుదలైన అన్ని భాషల్లోనూ పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద వసూళ్లవర్షం కురిపిస్తోంది.  ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు 'కాంతార' మూవీపై తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ముందుగా డార్లింగ్ ప్రభాస్ 'కాంతారా'పై ప్రశంసలు కురిపించారు.

ఆ తర్వాత అనుష్క శెట్టి సైతం 'కాంతారా'ను చూశానని ఈ మూవీ థియేటర్లలోనే చూడాల్సిన సినిమా అంటూ కామెంట్ చేసింది. తాజాగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ 'కాంతారా'పై తన రివ్యూను ఇన్ స్ట్రాలో వెల్లడించింది. ఇటీవలే తన ఫ్యామిలితో కలిసి 'కాంతారా' మూవీ చూశానని చెప్పింది. ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు, హీరో రిషబ్ శెట్టిని అభినందించకుండా ఉండలేక పోతున్నానని చెప్పింది.

తాను సైతం గతంలో దర్శకత్వం చేస్తూనే నటించానని గుర్తు చేసుకుంది. ఒకేసారి దర్శకత్వం, నటించడం చాలా కష్టమైన పని అని చెప్పింది. ఒళ్లు గగుర్పురిచే థిల్లర్ కథతో దర్శకుడు కమ్ హీరో రిషబ్ శెట్టి చేసిన ప్రయత్నం నిజంగా హ్యాట్సప్ అంటూ ప్రశంసలు కురిపించింది. కాగా ఈ సినిమా తాలుకూ ఎఫెక్ట్ నుంచి బయటికి రావడానికి కనీసం వారం రోజులు పడుతుందంటూ అంతలా ఈ మూవీ తనను ప్రభావితం చేసిందని తెలిపింది.

అయితే ఈ సినిమాను మేకర్స్ అనుకున్న స్థాయిలో ప్రమోషన్స్ చేయలేదని చెప్పింది. సరైన రీతిలో ప్రచారం చేస్తే ఈ మూవీ కార్తీకేయ-2 కంటే భారీ హిట్టు అయ్యేదనే అభిప్రాయాన్ని కంగనా రనౌత్ వెల్లడించింది. కాగా హిందీలో కేవలం మౌత్ టాక్ తోనే ఈ మూవీ కలెక్షన్లలో దూసుకెళుతోంది.

హిందీలో తొలి వారంలోనే ఈ సినిమా రూ.15కోట్ల నెట్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇక తెలుగు, హిందీ కలుపుకొని 30కోట్ల మేర లాభాలు నిర్మాతలకు వచ్చే అవకాశం ఉందనే టాక్ విన్పిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News