మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ డబుల్ స్టాండార్డ్ (ద్వంద్వ ప్రమాణాలు) ఉన్న మనిషా? అంటే అవుననే విమర్శిస్తోంది క్వీన్ కంగన. అతడు భారతదేశంలో అసహనం గురించి ఫిర్యాదు చేస్తున్నాడు. కానీ టర్కీ వెళ్లి అక్కడ అధ్యక్షరాలితో ఆతిథ్యం అందుకుంటున్నాడు! అంటూ కంగన తీవ్ర విమర్శలు చేస్తోంది.
అతడు మంచి స్నేహితుడు. కానీ స్నేహితుడు తప్పు చేస్తుంటే చూస్తూ అలా వదిలేయాలా? అని ప్రశ్నించి వేడి పెంచింది. అంతేకాదు సుశాంత్ సింగ్ మరణంపై అతడు స్పందించక పోవడానికి.. కనీసం సంతాపం చెప్పడానికి మనసు రాకపోవడానికి కారణమేమిటో కూడా విడమర్చి చెప్పింది క్వీన్.
``సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి ఆమీర్ ఎందుకని సంతాపం చెప్పలేదు? అమీర్ ఖాన్ సుశాంత్ తో కలిసి పీకేలో పనిచేశారు. అతను ఏమీ అనకపోతే.. అనుష్క కూడా ఏమీ అనదు.. రాజు హిరానీ ఏమీ అనడు.. ఆదిత్య చోప్రా .. అతని భార్య రాణి ముఖర్జీ కూడా ఏమీ అనరు. ఈ రాకెట్ ఒక ముఠా లాగా పనిచేస్తుంది`` అంటూ మాఫియా తీరును ఎండగట్టింది. మొత్తానికి మిస్టర్ పెర్ఫెక్టునే వదల్లేదు బొమ్మాళీ.