ఈసారి నసీరుద్దీన్ షా పై ధ్వజమెత్తిన కాంట్రవర్సీ క్వీన్..!!

Update: 2020-08-19 09:10 GMT
బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ ఇప్పట్లో నేపోటిజం చర్చను విడిచిపెట్టేలా లేదు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయినప్పటి నుండి ఆమె ఆరోపణలను వినిపిస్తూనే ఉంది. బాలీవుడ్‌లోని బంధుప్రీతి అలాగే మాఫియా కారణంగానే సుశాంత్ తన జీవితాన్ని వదులుకున్నాడని బలంగా చెబుతుంది. బయట వ్యక్తిగా.. కంగనా ప్రతి రోజు తన కామెంట్లతో బాలీవుడ్ మాఫియా కళ్లు తెరిపించడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఈసారి నేపోటిజం వివాదాన్ని మరో లెవెల్ కి తీసుకెళ్లింది. ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వివాదాలను చెలరేగేలా చేస్తున్నాయి. సుశాంత్ సింగ్ ఆత్మహత్య కాదు.. హత్యకు గురయ్యాడని అంటోంది. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో మూవీ మాఫియా కూడా ఉందని అంటోంది. అయితే తాజాగా నటుడు నసీరుద్దీన్ షా కంగనా ఆరోపణల పై స్పందించాడు.

ఆయన మాట్లాడుతూ.. అసలు బాలీవుడ్ ఇండస్ట్రీలో మాఫియా అనేదే లేదు. ఎవరైతే ఇండస్ట్రీలో జరుగుతున్న వాటి పై ఫ్రస్ట్రేషన్ కు లోనవుతున్నారో.. వారే కావాలని మీడియా ముందు ఇలా మాఫియా పేరుతో హల్చల్ చేస్తున్నారని అన్నాడు. ఇక నసీరుద్దీన్ షా.. కంగనా గురించి కూడా పలు వ్యాఖ్యలు చేసాడు. కంగనాలా హాఫ్ నాలెడ్జ్ తో చేసే ఆరోపణల పై ఎవరు ఆసక్తి చూపరు. అలాగే సుశాంత్ కు న్యాయం జరగాలని ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు, అభిప్రాయాల పై స్పందించే అవసరం లేదు. ఆ కేసుకు న్యాయం చేయడానికి చట్టం ఉందని.. చట్టం దాని పని అది చేసుకుంటుంది" అని కాస్త ఆగ్రహంగానే అన్నారు. ఇక నసీరుద్దీన్ వ్యాఖ్యల పై వెంటనే స్పందించిన కంగనా.. "ధన్యవాదాలు నసీర్ జి, నెపోటిజమ్ సపోర్ట్ చేస్తున్నట్లే మీరు నా అవార్డులు, అచీవ్ మెంట్స్ అన్నీ తూకం వేశారు. వీటన్నిటినికి నేను అలవాటు పడ్డాను. కానీ ఇవే వ్యాఖ్యలు నా స్థానంలో ప్రకాష్ పదుకోనె లేదా అనిల్ కపూర్ కూతురు ఉంటే చేస్తారా..?" అంటూ తనదైన శైలిలో జవాబిచ్చింది. ప్రస్తుతం కంగనా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Tags:    

Similar News