నటవారసుల్ని చీల్చి చెండాడుతూ క్వీన్ కంగన చేస్తున్న కామెంట్ల గురించి తెలిసిందే. `నెప్టోయిజం` అన్న మాటెత్తాలంటేనే భయపడేంతగా విరుచుకుపడుతోంది కంగన. ఈ విషయంలో మహేష్ భట్ వారసురాలు ఆలియాకు ఇప్పటికే కోటింగ్ పడుతూనే ఉంది. వీలున్న ప్రతి వేదికపై ఆలియాను చిన్నబుచ్చుతూ.. తనకు నటన సరిగా రాదనే యాంగిల్ ని టచ్ చేస్తోంది కంగన. అయితే అదంతా ఆలియా భట్ తండ్రి మహేష్ భట్ పై మంటతోనే అనేవాళ్లు ఉన్నారు. మహేష్ భట్ పై ఇప్పటికే కంగన రకరకాల ఆరోపణలు చేసింది. పాత కక్షల్ని కెలుకుతూ కొత్తగా ఏదో ఒక చిచ్చు పెట్టేందుకు కంగన వెనకాడటం లేదని ఇటీవల ఆ ఇద్దరి మధ్యా మాటల యుద్ధం చెబుతోంది.
మొన్నటికి మొన్న `గల్లీ బోయ్` చిత్రంలో ఆలియా ఏదో కష్టపడి నటించినట్టుందిలే అంటూ వ్యంగ్యంగా చెణుకులు విసిరింది. తను నటనలో ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని వ్యాఖ్యానించి వేడెక్కించింది క్వీన్. ఒకానొక సందర్భంలో అసలు నన్ను తన(ఆలియా)తో పోలుస్తారేంటి? అని మీడియాపైనే సీరియస్ అయ్యింది. కంగన నటించిన `మణికర్ణిక` ప్రచారానికి ఆలియా ముందుకు రాకపోవడంపైనా .. వీళ్లంతా ఇంతే నంటూ సీరియస్ అయ్యింది. అయితే ఈ గొడవల్లో కంగన తరపున తన సోదరి రంగోలి వకాల్తా పుచ్చుకుంటుంటే.. ఆలియా వైపు నుంచి డాడ్ మహేష్ భట్ బరిలో దిగారు.
ఒకానొక సందర్భంలో కంగనపైకి మహేష్ భట్ చెప్పు విసిరారని రంగోలి ఇదివరకూ ట్విట్టర్ వేదికగా ఆరోపించింది. `గల్లీ బోయ్` నటుడి తల్లి గారు సోని రజ్ధాన్ పైనా ఆయన దాడి చేశారు. నాన్ రెసిడెంట్ అంటూ మహేష్ భట్ రచ్చ చేశారని రంగోలి ఆరోపించింది. లేటెస్ట్ గా సోని రజ్ధాన్ కి చెందిన `యువర్స్ ట్రూలీ` ప్రీమియర్ వేదికగా మహేష్ భట్ దానికి కౌంటర్ గా స్పందించారు. ఈ మీడియా సమావేశంలో కంగన సోదరి రంగోలి చేసిన ఆరోపణల గురించి భట్ జీని కొందరు జర్నలిస్టులు ప్రశ్నించారు. ఆ క్రమంలోనే అతడు కంగనను ఉద్ధేశించి మాట్లాడుతూ ``తన(కంగన)ను నేను బచ్చీ (చిన్న పిల్ల)గానే చూస్తాను. మన పిల్లలపై మనం ఏం మాట్లాడతాం. ఎదిగే పిల్లలపై కామెంట్లు చేసే అలవాటు నాకు లేనేలేదు`` అని వ్యాఖ్యానించారు.
తాజా సన్నివేశంతో ఆలియా - కంగన మధ్య వివాదం ఇంకాస్తా తీవ్రంగానే ముదురుతోందా? అనిపించక మానదు. మహేష్ భట్ మాట్లాడుతూ .. ``తనో(కంగన) బచ్చి. మాతోనే తన కెరీర్ మొదలైంది. ఆమె బంధువు రంగోలి ఎటాక్ చేస్తోంది కాబట్టి మాట్లాడుతున్నా.. నేనేమీ తనపై కామెంట్ చేయలేను. మన పిల్లలపై మనం వేలెత్తి చూపడం అన్నది మన కల్చర్ లోనే లేదు. అలా వ్యతిరేకంగా మాట్లాడడం నాకు సాధ్యం కాదు. నేను చనిపోయే వరకూ నేను ఈ విధానానికే కట్టుబడి ఉంటాను. ఎప్పటికీ ఎదిగే పిల్లలకు వ్యతిరేకంగా మాట్లాడను. అది నా స్వభావానికే విరుద్ధం`` అని అన్నారు. మహేష్ భట్ తెరకెక్కించిన గ్యాంగ్ స్టర్ (2006) అనే చిత్రం ద్వారానే కంగన తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే అసలు మహేష్ భట్ తనని వెండితెరకు పరిచయం చేసిందేమీ లేదని.. అనురాగ్ బసు సినిమాతో బాలీవుడ్ కి పరిచయమయ్యానని కంగన ఇదివరకూ ఓ సందర్భంలో వాదించడం అప్పట్లో చర్చకు వచ్చింది.